2 రాష్ట్రాలకు కల్లక్కడల్ ముప్పు.. ఇదెంత డేంజర్ అంటే?
హిందూ మహాసముంద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణంగా చెబుతారు.
By: Tupaki Desk | 15 Jan 2025 4:18 AM GMTకేరళ.. తమిళనాడు రాష్ట్రాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. వాయుగుండం.. తుపాను.. పెను తుపాను.. సునామీ లాంటివి అందరూ విని ఉంటారు. మరి.. ఈ కల్లక్కడల్ అంటే మిటి? అన్న విషయంలోకి వెళితే..సముద్రంలో హటాత్తుగా సంభవించే మార్పుగా అభివర్ణిస్తారు. ఒక బందిపోటులా దూసుకు వస్తుందని చెప్పాలి. సముద్రం ఒక బందిపోటులా దూసుకొచ్చే తీరును కల్లక్కడల్ గా పేర్కొంటారు. ఎలాంటి వార్నింగ్ లేకుండా గాలులు వీయటాన్ని కల్లక్కడల్ గా పిలుస్తుంటారు.
హిందూ మహాసముంద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణంగా చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సూచన.. వార్నింగ్ ఇవ్వకుండా వీచే బలమైన గాలులుగా దీన్ని చెప్పాలి. స్థానికంగా దీన్ని కల్లక్కడల్ గా వ్యవహరిస్తారు. జనవరి 15 రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి ఒక మీటర్ మేర అలల తాకిడి ఉంటుందని.. సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్లుగా ఇండియన్ నేషనల్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వాహణ సంస్థ కూడా అలెర్టు అయ్యింది. అధికారుల సూచన మేర తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచన చేశారు.
తీరప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ పడవలు.. దేశవాళీ పడవులు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దన్న ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ముందుగానే పడవల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని కోరారు. అంతేకాదు.. ఈ ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పర్యాటకులు ఎవరూ బీచ్ లలో విహారానికి రాకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు.. తీర ప్రాంతాల మీద ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.