విశాఖ కేంద్రంగా హోమియోపతి మద్యం?
నకిలీ మద్యం విశాఖ కేంద్రంగా విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రభుత్వ అజమాయిషీ కొరవడటంతో ఇష్టారాజ్యంగా మద్యం రవాణా అవుతోంది.
By: Tupaki Desk | 3 May 2024 5:06 AM GMTనకిలీ మద్యం విశాఖ కేంద్రంగా విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రభుత్వ అజమాయిషీ కొరవడటంతో ఇష్టారాజ్యంగా మద్యం రవాణా అవుతోంది. దీంతో విశాఖలో నకిలీ మద్యం దందా సాగుతోంది. హోమియోపతి మందులతో మద్యం తయారు చేస్తున్నారు. ఇదేదో కొత్త రకం లిక్కర్ అనుకోవద్దు. హోమియోపతి మందులతో కల్తీ మద్యం తయారు చేస్తూ సరఫరా చేస్తున్నారు.
హోమియోపతి మందుల్లో ఉపయోగించే బెల్లడోనా ద్రావణంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన భార్యాభర్తలు దీన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో కిక్ మస్తుగా వస్తుందని పలువురు దీనికి అలవాటు పడుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
ఒక బెల్లడోనా బాటిల్ నుంచి రెండు క్వార్టర్ల మద్యం తయారు చేస్తున్నారు. బెల్లడోనా శక్తివంతమైన మందు. ఆయుర్వేదంలో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. దీంతో మైగ్రేన్ లాంటి లక్షణాలను నియంత్రించొచ్చు. దీనికి కార్బో వెజిటబుల్, అస్నిడోస్పెర్మా లాంటి ద్రావణాలు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దీంతో తాగిన వారికి మంచి కిక్ ఇస్తుంది. ఆరోగ్యం కూడా త్వరగా పాడవుతుంది.
రకరకాల బ్రాండ్లతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి ఆయుర్వేద మందులను కూడా వదలడం లేదు. దీంతో తయారు చేసిన మద్యానికి మంచి కిక్ ఉంటుంది. దీంతో ప్రజలు చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. తక్కువ ధరతో ఎక్కువ కిక్ రావడంతో అందరు దీనికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
నకిలీ మద్యం వ్యవహారం పోలీసులకు చేరింది. దీతో వారు 775 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తిలోని ఓ అపార్ట్ మెంట్ లో జరుగుతున్న దందాకు కారణమైన శిరీషను అరెస్టు చేశారు. తరువాత ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈ నకిలీ మద్యం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.