Begin typing your search above and press return to search.

కేసీఆర్ నాట్ రీచబుల్... ట్రై ఆఫ్టర్ లోక్ సభ ఎలెక్షన్స్!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్స్ కు కష్టకాలం నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   26 Feb 2024 1:30 PM GMT
కేసీఆర్ నాట్ రీచబుల్... ట్రై ఆఫ్టర్ లోక్ సభ ఎలెక్షన్స్!
X

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్స్ కు కష్టకాలం నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే అందుకు ప్రధానంగా అధినేత ఏమాత్రం సంసిద్ధత వ్యక్తం చేయలేకపోతున్నారని.. అసెంబ్లీలో అటు పక్కన కూర్చోడానికి ఆయన ఇష్టపడటం లేదని కూడా వినిపిస్తున్నాయి! దీంతో... ఒక్క ఎలక్షన్ బీఆరెస్స్ పూసాలు కదిలించిందనే కామెంట్లు వినిపిస్తుంటే... మరోపక్క జాతీయస్థాయిలో మనుగడ పూర్తిస్థాయిలో ప్రశ్నార్ధకం అయ్యిందనే మాటలూ వినిపిస్తున్నాయి.

అవును... తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆరెస్స్ అధినేత కేసీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బలంగా భావించి.. తెలంగాణ సెంటిమెంట్ తో ఉన్న టీఆరెస్స్ ను బీఆరెస్స్ గా కూడా మార్చగలిగారు కేసీఆర్. ఈ క్రమంలో జాతీయ రాజకీయల సంగతి దేవుడెరుగు.. తెలంగాణలోనే ప్రతిపక్ష పాత్ర దక్కింది! ఈ నేపథ్యంలో జాతీయస్థాయి నేతలకు కేసీఆర్ అస్సలు అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది.

విషయంలోకి వస్తే... తెలంగాణతో పాటు జాతీయస్థాయిలోనూ కారు జోరు చూపించాలని కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఆఫీసులు ఓపెన్ చేశారు. ఇక ప్రధానంగా మహారాష్ట్రలో అయితే వరుస బహిరంగ సభలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనుగడ సంపాదించుకున్నారు. అయితే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కథమొత్తం రివర్స్ అయ్యిందని తెలుస్తుంది.

దీంతో... త్వరలో ఎన్నికలు జరగనున్న ఏపీ నుంచి, మహారాష్ట నుంచీ బీఆరెస్స్ నేతలు కేసీఆర్ కు టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారంట. ప్రధానంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఓకేసారి ఎన్నికలు జరగనుండటంతో ఏపీలో బీఆరెస్స్ నేతలు పోటీ, ప్రచారం మొదలైన విషయాలపై మాట్లాడాలని కాల్స్ చేస్తుంటే... కేసీఆర్ నుంచి స్పందన కరువవుతుందని అంటున్నారు. అయితే... వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ విషయంలో కేసీఆర్ కాడె దింపేయడమే దీనికి కారణం అని అంటున్నారట అయినవారు!!

వాస్తవానికి ఇప్పుడు ఏపీలో బీఆరెస్స్ కి ఒక ఆఫీసులో, అందులో తోట చంద్రశేఖర్ తప్ప ఇంకెవరూ, ఇంకేమీ లేవనే మాటలు వినిపిస్తున్నాయి. ఈయన కూడా ఈ రోజో రేపో కారు దిగిపోతారని కథనాలొస్తున్నాయి. ఇక, ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు చాలా రోజుల కిందటే వైసీపీలో జాయిన్ అయిపోయారు. మరోపక్క మహారాష్ట్రలో ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగిపోయారని అంటున్నారు.

ఈ సమయంలో పార్టీలో ఉన్నవారంతా.. వాట్ నెక్స్ట్ అనే విషయంపై ఫోన్ చేయాలని భావించి కేసీఆర్ కి ఫోన్ చేస్తుంటే... "యూ ఆర్ ట్రయింగ్ టు కాల్ ఈజ్ నాట్ రీచబుల్" అని వస్తుందంట! ఇలా ఎంతకాలం అని ఆలోచిస్తున్నవారికి... "కాల్ ఆఫ్టర్ తెలంగాణ లోక్ సభ ఎలక్షన్స్" అని అనధికారిక సూచన అందుతుందని తెలుస్తుంది. కారణం... తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపైనే కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆధారపడి ఉంటాయని అంటున్నారు!!