నాన్న అంతలా తిట్టేసిన తర్వాత సుద్దులు చెప్పుడేంది చిన్నసారు?
నోటికి వచ్చినట్లుగా తిట్టేసిన గులాబీ బాస్ కేసీఆర్ మాటల తర్వాత.. ఇంత ఫస్ట్రేషన్ ఏంది బాసూ అన్న భావన కలుగక మానదు
By: Tupaki Desk | 7 April 2024 5:08 AM GMTపిచ్చి ముండల్లారా..
కుక్కల కొడుకుల్లారా..
దొంగ నాకొడుకులు
పండబెట్టి తొక్కుత..
కాంగ్రెస్ నేతలు అసమర్థులు.. చవటలు.. సన్నాసులు..
కాళేశ్వరం తోక తెల్వదు.. తొండం తెల్వదు
వేటాడుతా.. వెంటాడుతా..
కిరికిరి మాటలు.. తొండి మాటలు..
లత్కోర్ మాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
ఇవన్ని శాంపిల్ మాటలు. ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది కదా? చాలా కాలం తర్వాత జనాల్లోకి వచ్చి.. పంటలు ఎండిపోతున్నాయంటూ ఒక రోజు టూర్ పెట్టి.. సాయంత్రం కాగానే సభ పెట్టేసి.. ప్రభుత్వం మీదా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి కసి తీరా.. నోటికి వచ్చినట్లుగా తిట్టేసిన గులాబీ బాస్ కేసీఆర్ మాటల తర్వాత.. ఇంత ఫస్ట్రేషన్ ఏంది బాసూ అన్న భావన కలుగక మానదు.
ప్రభుత్వం కొలువు తీరి వందరోజులు మాత్రమే అయిన వేళలో.. విమర్శలు చేయాలంటే చేయొచ్చు. కాకుంటే.. నోరు తెరిస్తే నీతులు చెబుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఎంత మర్యాదగా.. గౌరవంగా చూడాలె. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలె.. అంటూ సుద్దులు చెప్పిన పెద్ద మనిషి.. ఈ రోజున ఇంతలా మాట్లాడేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం దొరకని స్థితిలో.. ఆ మాటల హోరు నుంచి బయటకు రాని తెలంగాణ ప్రజలకు మరోసారి తనదైన స్టైల్ లో షాకిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
ఒక రోజు క్రితం తన తండ్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని.. అధికార పార్టీ నేతల్ని.. నోటికి వచ్చినట్లుగా తిట్టి పోస్తూ మాట్లాడిన మాటల హోరు ఇంకా ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోక ముందే.. కేటీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సుద్దులు చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. తండ్రి తిట్టేస్తాడు.. కొడుకు కవర్ చేస్తూనే మరోసారి తిట్టేసి కసి తీర్చుకున్న వైనంతో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తండ్రి కొడుకుల మాటల్నివిన్న తర్వాత.. వీరికి మించిన ‘కసి ఫ్యామిలీ’ మరెక్కడా ఉండరన్నట్లుగా కొందరు అభివర్ణించటం గమనార్హం. సభ పెట్టి మరీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి నానా మాటలు అనేసిన కేసీఆర్ సంగతిని పక్కన పెడితే.. శనివారం తెలంగాణ వ్యాప్తంగానిర్వహించిన రైతు దీక్షల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన సభలో మాట్లాడిన కేటీఆర్.. ‘‘కేసీఆర్‌ను బద్నాం చేయాలె. బీఆర్‌ఎ్‌సను ఖతం చేయాలె. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం విధానం ఇదీ. బూతులు మాట్లాడడం, నోరు పారేసుకోవడం తప్ప ఈ ముఖ్యమంత్రికి పంటలు నీళ్లిచే మొహం లేదు. పైసలిచ్చే దమ్ము గానీ.. రైతు బంధు ఇచ్చే తెలివి గానీ లేదు. సీఎం గుంపు మేస్త్రీ అయితే.. ప్రధాని మోదీ తాపీ మేస్త్రీ లెక్క. ఇద్దరూ కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి.. సమాధి కట్టాలి.. అని చూస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. మొత్తంగా కేటీఆర్ మాటలు బీఆర్ఎస్ కు శాపాలుగా మారుతున్నాయన్న మాటకు బలం చేకూరేలా తాజా ఎపిసోడ్ ఉందన్న మాట వినిపిస్తోంది.