Begin typing your search above and press return to search.

బీ కామెంట్... కాంగ్రెస్ కు ఒక్క ఫోటోతో దొరికేసిన కవిత!

పోలింగ్ కి సమయం దగ్గరపడుతుండటం.. ప్రచారాలకు మరో రెండు వారాల లోపే సమయం ఉండటంతో తెలంగాణలో పార్టీలన్నీ హోరెత్తించేస్తున్నాయి

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:08 AM GMT
బీ కామెంట్... కాంగ్రెస్ కు ఒక్క ఫోటోతో దొరికేసిన కవిత!
X

పోలింగ్ కి సమయం దగ్గరపడుతుండటం.. ప్రచారాలకు మరో రెండు వారాల లోపే సమయం ఉండటంతో తెలంగాణలో పార్టీలన్నీ హోరెత్తించేస్తున్నాయి. వారి వారి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్ధి పార్టీలను ఇరుకునపెట్టేలా నెట్టింట ప్రచారాలూ మరింత ముఖ్యం అనే సూత్రంతో దూసుకుపోతున్నాయి. ఈ విషయంలో తాజాగా బీజేపీ - బీఆరెస్స్ లను ఒక ఫోటోతో ఇరికించేస్తుంది కాంగ్రెస్ పార్టీ!

అవును... తెలంగాణలో గతకొన్ని రోజులుగా బీఆరెస్స్ అంటే బీజేపీకి బీ టీం అని, ఆ రెండింటిలో ఎవరికి ఓటు వేసినా ఒకటేనని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. బీఆరెస్స్ - ఎంఐఎం లను బీజేపీనే ఆడిస్తుందని.. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి పలు రాష్ట్రాల్లో ఎంఐఎం ను బీజేపీ పెద్దలే రంగంలోకి దింపుతుంటారని తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు.

ఈ క్రమంలో బీఆరెస్స్ - బీజేపీలను ఒకేగాటిన కట్టే విషయాలపై మరింత తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మరో అడుగు ముందుకేసినట్లు ఒక విషయాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా... బీజేపీ అగ్రనేత‌, ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీతో కేసీఆర్ కుమార్తె క‌విత దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలో కవితతో పాటు పలువురు బీఆరెస్స్ నేతలు మోడీకి శాలువా కప్పి, అనంతరం సెల్ఫీ దిగుతుండగా తీసిన ఫోటోలా ఉంది! దీంతో ఈ ఫోటోతో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రచారంతో హోరెత్తించేస్తుంది. ఆ రెండు పార్టీలూ ఒకటేనంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోను తెగవైరల్ చేస్తుంది. అయితే ఆ ఫోటో ఎప్పటిది అనే విషయం స్పష్టత లేనప్పటికీ... మోడీని - కవిత ఒకే ఫ్రేం లో ఉండటాన్ని క్యాష్ చేసుకునేపనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బిజీ అయిపోయింది.

ఈ ఫోటోకి తోడు లిక్కర్ స్కాం విషయాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇందులో భాగంగా... ఆప్ నేతలకు బెయిల్స్ కూడా దొరక్క లిక్కర్ స్కాం లో జైల్లో మగ్గిపోతుంటే... కవిత మాత్రం బయటే ఉన్నారని.. ఇదంతా మోడీ – కేసీఆర్ బంధాన్నికి బలమైన సాక్ష్యం అని చెప్పుకొస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

కాగా... మరో రెండు వారాల అనంతరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ తమ ప్రచారాలను పీక్స్ కి తీసుకునివెళ్లిపోతున్నాయి! ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి నిలవాలని, బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటుండగా... కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీఆరెస్స్ నేతలు విమర్శిస్తున్నారు. మరోపక్క బీజేపీ.. జనసేనతో కలిసి పోటీచేస్తుంది.