Begin typing your search above and press return to search.

ఇంతకీ కాల్వ దారెటు ?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కీలకమైన నేతల్లో మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఒకళ్ళు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే 1999లో ఎంపీగా పోటీచేసి గెలిచారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 1:30 PM GMT
ఇంతకీ కాల్వ దారెటు ?
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కీలకమైన నేతల్లో మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఒకళ్ళు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే 1999లో ఎంపీగా పోటీచేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లో రాయదుర్గం నుండి ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచారు. ఎంఎల్ఏగా గెలిచిన వెంటనే చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దొరికింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుండి పార్టీలో యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో కాల్వ దారి అనంతపురం పార్లమెంటా లేకపోతే రాయదుర్గం అసెంబ్లీనా అన్నది తేలలేదు.

పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే కాల్వను చంద్రబాబు అనంతపురం ఎంపీగా పోటీచేయించాలని అనుకుంటున్నారు. అనంతపురం నుండి కాల్వను, హిందుపురం పార్లమెంటు నియోజకవర్గంలో బీకే పార్ధసారధిని పోటీచేయించేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పై ఇద్దరు నేతలకు స్పష్టంగా చెప్పేశారట. అయితే కాల్వ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. మాజీమంత్రి దృష్టి పార్లమెంటుకు పోటీచేయటం మీద లేదని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

తాను ఎంపీగా పోటీచేయనని, రాయదుర్గం ఎంఎల్ఏ గానే పోటీచేస్తానని నేరుగా చంద్రబాబుతోనే కాల్వ చెప్పారట. అయితే అందుకు అధినేత కన్వీన్స్ కాలేదని సమాచారం. కాల్వ ఎంపీగా ఎందుకు పోటీచేయటానికి ఇష్టపడటంలేదు ? ఎందుకంటే ఇందుకు రెండుకారణాలున్నాయట. అవేమిటంటే మొదటిది ఎంపీ గెలుపు మీద నమ్మకంలేకపోవటమే. ఒకవేళ గెలిచినా కేంద్రంలో చేయగలిగేది ఏమీలేదని కాల్వ తన సన్నిహితులతో చెప్పారట. టీడీపీ ఎన్డీయేలో పార్టనర్ కాదు కాబట్టి ఒకవేళ ఎంపీగా గెలిచినా ఢిల్లీలో చేసేది ఏమీ ఉండదని కాల్వ భావనగా సన్నిహితులు చెబుతున్నారు.

అదే రాయదుర్గంలో ఎంఎల్ఏగా గెలిస్తే మళ్ళీ మంత్రవర్గంలో చోటు దక్కుతుందని అనుకుంటున్నారట. అంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని కాల్వ బలంగా నమ్ముతున్నారని అర్ధమవుతోంది. పైగా పార్లమెంటు పరిదిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్ధులపై సరైన క్లారిటి లేదు. కొంతమంది ఆశావహులతో కాల్వకు పెద్దగా పడదట. అందుకని ఛాన్స్ తీసుకోవటానికి కాల్వ ఏమాత్రం సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకనే చంద్రబాబు ఎంపీగా పోటీచేయమంటే కాల్వేమో అసెంబ్లీకి పోటీపైనే పట్టుబడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.