పుతిన్ విషయంలో హారిస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే..?
అవును... వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థికా బరిలో ఉన్న కమలా హారిస్... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 Oct 2024 5:28 AM GMTఅమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్నికల ప్రచారాలతో ట్రంప్, హారిస్ ఊదరగొట్టేస్తున్నారు! ఇదే సమయంలో... ఎన్నికల హామీలతో పాటు దౌత్యపరమైన ఆలోచనా విధానం అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది. ఈ సమయంలో పుతిన్ పై హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థికా బరిలో ఉన్న కమలా హారిస్... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలబోనని ప్రకటించారు.
సీబీఎస్ "60 మినిట్స్" కార్యక్రమంలో భాగంగా రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు ఒకరితో ఒకరు కలుసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు... ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు కావు.. ఉక్రయిన్ తన భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలి అని ఆమె పేర్కొన్నారు. గతంలోనూ అధ్యక్షుడు జో బిడెన్.. పుతిన్ తో చర్చలను తిరస్కరించిందని తెలిపారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ పై రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలపైనా హారిస్ తన విమర్శలను పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా... గతంలో ఉక్రెయిన్ కు వాషింగ్టన్ భారీ సైనిక, ఆర్థిక సహాయాన్ని ట్రంప్ విమర్శించారని.. పుతిన్ తో త్వరగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని పట్టుబట్టారని అన్నారు.
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే.. పుతిన్ ఇప్పటికే కైవ్ లో కూర్చునేవారని అన్నారు.
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేవారకూ తాను వెన్నంటే ఉంటానని వెల్లడించారు. ట్రంప్ గెలవకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలని మస్క్ అభిప్రాయపడ్డారు.
టకర్ కార్లసన్ తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మస్క్... డెమోక్రాట్లు గెలిస్తే ప్రజాస్వామ్యానికి పెను ముప్పని ఆరోపించారు. వలసదారులను కొన్ని కీలక రాష్ట్రాలకు ఉద్దేశ్యపూర్వకంగా తరలిస్తున్నట్లు తాను నమ్ముతున్నానని అన్నారు. వారికి గనుక పౌరసత్వం లభిస్తే వారు డెమోక్రాట్ల ఓటర్లుగా మారతారని వ్యాఖ్యానించారు.