కమలా హారిస్ యూఎస్ లో గంజాయిని లీగల్ చేయబోతున్నారా?
అత్యంత రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Oct 2024 7:30 PM GMTఅత్యంత రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఇమిగ్రేషన్స్, అక్రమ వలసలు వంటి విషయాలపై ఇరు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థుల మధ్య బలమైన మాటల యుద్ధాలు జరిగిన వేళ.. ఇప్పుడు తాజాగా వినోద గంజాయి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు గంజాయిని చట్టబద్ధం చేయడం అనే అంశం కూడా కీలకంగా మారిందని అంటున్నారు. ఈ విషయంలో కమలా హారిస్ పెద్ద రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా... గంజాయిని చట్టబద్ధం చేసేందుకు ఆమె మద్దతుగా నిలిచారు.
అయితే... ఇలా గంజాయిని చట్టబద్ధం చేసే విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పుడూ పెద్దగా మాట్లాడకపోవడంతో ఈమె తాజా వ్యవహారం డెమొక్రాట్ మద్దతుదారులకు ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు. ఇలా కమలా హారిస్ ఫెడరల్ స్థాయిలో వినోద గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయడ్దానికి తన మద్దతు ప్రకటించారు.
స్పోర్ట్స్ పోడ్ కాస్ట్ "ఆల్ ది స్మోక్" లో అతిథిగా పాల్గొన్న డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గంజాయిని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదే సమయంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని తాను చాలాకాలంగా భావిస్తున్నట్లు హారీస్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో... దేశవ్యాప్తంగా గంజాయిని పూర్తిగా చట్టబద్ధం చేయడానికి ఇది సమయం అని చెప్పిన హారిస్... గత మాదకద్రవ్యాల చట్టాల వల్ల ఏర్పడిన జాతి, సామాజిక అసమానతలను పరిష్కరించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
కాగా... గంజాయి చట్టబద్ధత అమెరికాకు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటుందని చెబుతారు. గంజాయి పాలసీ ప్రాజెక్ట్ ప్రకారం... రాష్ట్రాలు 2023లో ఈ పరిశ్రమ నుంచి 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్ను రాబడిని సేకరించాయని అంటారు.
గంజాయి చట్టబద్ధత అమెరికాకు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటుంది. గంజాయి పాలసీ ప్రాజెక్ట్ ప్రకారం, రాష్ట్రాలు 2023లో పరిశ్రమ నుండి $4 బిలియన్ల కంటే ఎక్కువ పన్ను రాబడిని సేకరించాయి. మరోపక్క అత్యధిక మంది అమెరికన్లు గంజాయిని చట్టబద్ధం చేయడనైకి మద్దతు ఇస్తున్నారనే విషయం గాలప్ పోల్ వెల్లడించింది!
ఇందులో భాగంగా... గత నవంబర్ నుంచి గాలప్ సర్వేలో సుమారు 70 శాతం మంది గంజాయిని పూర్తిగా చట్టబద్ధం చేయడాన్ని సమర్థిస్తుండగా.. కేవలం 29 శాతం మంది మాత్రమే డ్రగ్ చట్టవిరుద్ధంగా ఉండాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ అన్ని విషయాలనూ పరిగణలోకి తీసుకుని హారిస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.