Begin typing your search above and press return to search.

ట్రంప్ కు 2020 హిస్టరీ టెన్షన్.. హారిస్ కు 2024 మిస్టరీ క్వశ్చన్ @ స్వింగ్ స్టేట్స్!

కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ గా మారిన తర్వాత మాత్రం రసవత్తరంగా నడుస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 3:32 PM GMT
ట్రంప్  కు 2020 హిస్టరీ టెన్షన్.. హారిస్  కు 2024 మిస్టరీ క్వశ్చన్ @ స్వింగ్  స్టేట్స్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. జూలైలో జో బిడెన్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారీస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు వీరిద్దరూ పూర్తిగా స్వింగ్ స్టేట్స్ పైనే దృష్టి సారించారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. ట్రంప్ వర్సెస్ బైడెన్ గా ఉన్నప్పుడు కాస్త వార్ వన్ సైడ్ గా ఉన్నట్లు అనిపించినప్పటికీ... కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ గా మారిన తర్వాత మాత్రం రసవత్తరంగా నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఇద్దరు నేతలకూ స్వింగ్ స్టేట్స్ అత్యంత కీలకంగా ఉన్నాయని అంటున్నారు.

స్వింగ్ స్టేట్స్ అంటే ఏమిటి?

వాస్తవానికి స్వింగ్ స్టేట్ అనే వర్గీకరణ అధికారికం కాదు కానీ.. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఏ రాష్ట్రాలు అత్యంత ప్రధానమైనవో, కీ రోల్ పోషిస్తాయని భావిస్తారో వాటిని పోల్ స్టర్ లు అలా పేర్కొంటారు! ఈ రాష్ట్రాల్లో ప్రత్యర్థుల మధ్య ఓట్ల తేడా అతి స్వల్పంగా ఉంటూ టఫ్ ఫైట్ కి దారి తీస్తుంది!

ఈ క్రమంలో తాజా ప్రెసిడెంట్ రేసులో... అరిజోనా, ఫ్లోరిడా, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవెడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ లు కీలక రాష్ట్రాలుగా ఉన్నాయి. దీంతో వీటిని స్వింగ్ స్టేస్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో ఫ్లోరిడా, నార్త్ కరోలినా మినహా మిగిలిన ఆరూ 2020లో జో బైడెన్ కి జై కొట్టాయి.

ఏయే రాష్ట్రాలు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయి?:

1976 నుంచి రిపబ్లికన్స్ కే అనుకూలంగా ఉన్నట్లు పేరు సంపాదించుకున్న అరిజినోవాలో 2020 ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించారు. ఇది చాలామంది పరిశీలకులను ఆశ్చర్యపరిచినట్లు చెబుతారు. 2008, 2012 లతో పాటు ట్రంప్ పోటీచేసిన 2016 ఎన్నికల్లో ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థికి స్థిరంగా ఓటు వేశారు.

ఇక 1996 - 2016 మధ్య రిపబ్లికన్స్ రాష్ట్రమైన జార్జియా 2020లో బైడెన్ కు అవకాశం ఇచ్చింది. అయితే... ఇప్పుడు బైడెన్ మద్దతు ఈ రాష్ట్రాల్లో అస్థిరంగా కనిపిస్తోందని అంటున్నారు. 2024లో ఇది డెమోక్రాట్లకు ఇబ్బంది కలిగించొచ్చని చెబుతున్నారు.

రిపబ్లికన్ లకు ఏ రాష్ట్రాలు అవసరం?:

ఎనిమిది స్వింగ్ స్టేట్స్ లోనూ 2020లో ఆరు స్వింగ్ స్టేట్ లు జో బైడెన్ కు జై కొట్టిన నేపథ్యంలో... వాటిని తిరిగి గెలుచుకోవడమే రిపబ్లికన్ అభ్యర్థి ముందున్న బిగ్ టాస్క్ అని చెప్పాలి. గత ఎన్నికల్లో డెమోక్రటిక్ రాష్ట్రాలుగా ముద్రపడిన వీటిలో సత్తా చాటడానికి ప్రయత్నించాలి.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2020 తరహాలోనే ఫ్లోరిడాలో రిపబ్లికన్స్ కి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ఒకప్పుడు అత్యంత టఫ్ రేసుల్లో ఒకటిగా పరిగణించబడేది. అయితే.. ఇప్పుడు బలమైన రిపబ్లికన్ గా మారిందని చెప్పొచ్చు.

ఇక గత ఎన్నికల్లో జో బైడెన్ కి షాకిచ్చిన నార్త్ కరోలినాలో ట్రంప్ తృటిలో గెలిచారు. దీంతో.. ఈ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని విస్తరించాలని ట్రంప్ ఇక్కడ సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

కాగా... 538 ఎలక్టోరల్ ఓట్లలోనూ అరిజోనాలో 11, జార్జియాలో 16, మిచిగాన్ లో 15, నెవెడాలో 6, ఉత్తర కరొలీనాలో 16, పెన్సిల్వేనియాలో 19, విస్కాన్సిన్ లో 10 కలిసి ఈ స్వింగ్ స్టేట్స్ లో మొత్తం 93 ఓట్లు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కమలా హారిస్ కు 226, ట్రంప్ కు 219 దక్కుతాయని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.

దీంతో.. ఈ ఎన్నికల్లోనూ ఈ స్వింగ్ స్టేట్స్ ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా, మరింత కీలకంగా ఉన్నాయి. మరి ఈ స్వింగ్ స్టేట్స్ ఈ సారి రిపబ్లికన్స్ కి జై కొడతాయా.. లేక, డెమోక్రాట్లకు పట్టం కడతాయా అనేది వేచి చూడాలి!