కంటేనే అమ్మ అని అంటే ఎలా?... కమలా హారిస్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాలతో అగ్రరాజ్యం హోరెత్తిపోతుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
By: Tupaki Desk | 7 Oct 2024 3:30 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాలతో అగ్రరాజ్యం హోరెత్తిపోతుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో సంతానం విషయంలో హారిస్ పై ఆర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
అవును... హ్యారిస్ కు పిల్లలు లేరని, అందుకు ఆమె అణకువగా ఉండరని ఆర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ శాండర్స్ వ్యాఖ్యనించారు. దీనిపై కమలా హారీస్ ఎదురాడి చేశారు. ఇందులో భాగంగా... ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారనే విషయం సారా అర్ధం చేసుకొలేకపోయినట్లు తాను భావిస్తున్నానని అన్నారు.
ఇది 1950ల నాటి కాలం కాదని.. కుటుంబం అనేది రకరకాలుగా ఏర్పడుతుందని.. కాల్ హర్ డాడీ పోడ్ కాట్ హోస్ట్ అలెక్స్ కూపర్ తో హారిస్ అన్నారు. ఆదివారం ప్రసారమైన టేప్ చేసిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించారు. మనం రక్తం ద్వారా కుటుంబాన్ని కలిగి ఉన్నామని, ప్రేమ ద్వారా కూడా కలిగి ఉన్నామని.. తనకు రెండూ ఉన్నాయని హారిస్ స్పష్టం చేశారు.
తన భర్త డగ్ ఎమ్ హోఫ్ కు ఉన్న ఇద్దరు పిల్లలకు సవతి తల్లి అయిన తాను దానిని నిజమైన ఆశీర్వాదం భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు పిల్లలు కోల్, ఎల్లా లతో తన సంబంధాన్ని హరీస్ వివరించారు. వారి తన భర్త మొదటి వివాహం నుంచి వచ్చిన జీవసంబంధ పిల్లలని.. "వారు నా పిల్లలు, నేను మరణం వరకూ వారిని ప్రేమిస్తాను" అని హారీస్ తెలిపారు.
కాగా... ట్రంప్ సహచరుడు ఓహియోకు చెందిన జేడీ వాన్స్ కూడా ఇదే ప్రతిపాదికన మహిళలపై కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... 2021లో జీవసంబంధమైన పిల్లలు లేని డెమోక్రట్ లు " పిల్లలు లేని పిల్లి స్త్రీల సమూహం" అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించారు కమల హారిస్.
ఇందులో భాగంగా... సహజంగా గర్భం దాల్చలేని, పిల్లలను కనలేని మహిళలకు వాన్స్ వ్యాఖ్యలు ఏమి సందేహం పంపాయో చెప్పాలని అడిగారు. ఇవి నీచమైన వ్యాఖ్యలుగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.