కమలమ్మకు అంత ఈజీకాదు.. ముందున్న సవాళ్లు ఇవే..!
అఫ్ కోర్స్ ట్రంప్ గెలిచినా ఇవే సవాళ్లు ఉంటాయి. కానీ, కమలకు.. ట్రంప్‌కు భిన్నమైన వ్యత్యాసం ఉంది.
By: Tupaki Desk | 28 July 2024 10:30 AM GMTడెమొక్రాట్ల ఆశలకు ఊపిరిలూదుతూ.. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఉరఫ్ కమలా దేవి, కమలమ్మ.. అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. నిన్న మొన్నటి వరకు వెనుకబడిన అధికార పార్టీ పుంజుకునేలా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును తట్టుకుని మరీ తన గెలుపు గుర్రాన్ని సవారీ చేయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రేపు ఒక వేళ గెలిచినా.. కమల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
అఫ్ కోర్స్ ట్రంప్ గెలిచినా ఇవే సవాళ్లు ఉంటాయి. కానీ, కమలకు.. ట్రంప్‌కు భిన్నమైన వ్యత్యాసం ఉంది. ట్రంప్ దేనినైనా సమర్థించుకునే నాయకుడు. కెనడాకు గొడ కడతానని అన్నప్పుడు సొంత రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా..ఆయన తన దూకుడు తగ్గించుకోలేదు. ముందుకే సాగారు. డెమొక్రాట్లకు మావాళ్లుఅ మ్ముడు పోయారు! అంటూ.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు సంధించి వారిని కట్టడి చేశారు. కొందరిని నేరుగానే పేరు పెట్టి మరీ దూషించారు. ఇంత సాహసం డెమొక్రాట్లకు లేదు.
అందునా.. మిశ్రమ జాతి పౌరురాలిగా ట్రంప్ తీవ్రస్తాయిలో విమర్శిస్తున్న కమల.. కేవలం ఒక్కరి ప్రయో జనాలకు మాత్రమే పనిచేసే సాహసం కూడా చేయలేరు. ముఖ్యంగా శ్వేతజాతీయుల డిమాండ్లు ఒకవైపు తుపాకీ కల్చర్‌ను తుదముట్టించాలన్న విభిన్న జాతుల డిమాండ్లు మరోవైపు.. కమలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే.. తుపాకీ చట్టాన్నిరద్దు చేయడమో.. కొంత వరకు పరిమితం చేయడమో ఖాయమన్నారు.
కానీ, కమల అలా చెప్పలేక పోతున్నారు. చట్టాలను గౌరవిస్తామని అంటున్నారు. ఇక, నిరుద్యోగం ఇప్పు డు ఆమె ముందు ప్రధాన సవాల్. స్థానికులకు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేసమయంలో వసల విధానంపై బైడెన్ తీసుకువచ్చిన పాలసీపైనా తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిని ఎత్తేయాలన్నది ప్రస్తుతం అమెరికాలో ఓ వర్గం చేస్తున్న డిమాండ్. దీనిని ట్రంప్ కూడా ఏకీభవిస్తున్నారు.
ఇదేసమయంలో గ్రీన్ కార్డు సమస్య కూడా కమలకు ఇబ్బందిగా మారింది. కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ సమస్యను తానైతే..ఇప్పటికిప్పుడు చిటికెలో పరిష్కరిస్తానని ట్రంప్ చెబుతుండగా.. కమల ఎలాంటి హామీ ఇవ్వలేక పోతున్నారు. మొత్తంగా చూస్తే.. అగ్రరాజ్యంలో జరుగుతున్న పోరులో కమలకు సవాళ్లే ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం.