రెండు రోజుల్లో పెద్ద గుడ్ న్యూస్
తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. త్వరలో తన నుంచి పెద్ద గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లుగా ప్రకటించాడు.
By: Tupaki Desk | 19 Feb 2024 9:24 AM GMTకమల్ హాసన్ ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాల్లో కూడా బిజీ ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కమల్ 2018 లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ప్రభావం చూపించలేకపోయాడు.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కచ్చితంగా ఎంఎన్‌ఎం పార్టీ నిలబడుతుందని గతంలోనే కమల్ ప్రకటించాడు. అయితే ఈసారి మరో పార్టీ తో పొత్తు తో ఎన్నికలకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే పార్టీ తో కమల్ హాసన్ సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ మధ్య మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా కమల్ పార్టీ తో పొత్తు ఉండే అవకాశం ఉందన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక ఉప ఎన్నికలో డీఎంకే పార్టీకి కమల్ మద్దతు ఇచ్చాడు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీ బోణీ కొట్టాలి అంటే అధికార డీఎంకే పార్టీ తో పొత్తు తప్పనిసరి అని పార్టీ నాయకత్వం మరియు కార్యకర్తలు భావిస్తున్నారట. ఆ విషయమై కమల్ త్వరలో అధికారికంగా ఏదో ఒక ప్రకటన చేస్తాడని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. త్వరలో తన నుంచి పెద్ద గుడ్ న్యూస్ వస్తుంది అన్నట్లుగా ప్రకటించాడు. దాంతో చాలా మంది ఆయన పొత్తు విషయమై ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
మరి కొందరు ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలను ఏమైనా వెళ్లడిస్తాడేమో చూడాలి అంటూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం కల్కి సినిమాతో పాటు థగ్స్ లైఫ్ సినిమా లో నటిస్తున్నాడు. మరో రెండు సినిమాలు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.