Begin typing your search above and press return to search.

చేజిక్కిన కామారెడ్డి మునిసిపాలిటీ.. ఓడిపోయిన బీఆర్ ఎస్‌!

కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.

By:  Tupaki Desk   |   30 March 2024 10:29 AM GMT
చేజిక్కిన కామారెడ్డి మునిసిపాలిటీ.. ఓడిపోయిన బీఆర్ ఎస్‌!
X

తెలంగాణను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ప‌దేళ్ల‌పాటు చ‌క్రం తిప్పిన బీఆర్ ఎస్‌కు.. ఇప్పుడు కాలం క‌లిసి రావ డంలేదు. ఏం చూసినా.. ఏం చేసినా.. వ్య‌తిరేక ఫ‌లిత‌మే వస్తోంది. నాయ‌కులు జంప్ అవుతున్నారు. విశ్వాసులు అవిశ్వాసం ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోవైపు కీల‌క నేత‌ల‌పై కేసుల క‌త్తి వేలాడుతోంది. ఏకంగా సీఎం కేసీఆర్ పైనే కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల నుంచి పార్టీని బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రో భారీ దెబ్బ త‌గిలింది.

కామారెడ్డి మునిసిపాలిటీలో బీఆర్ ఎస్ ఆధిక్యం కోల్పోయింది. దీంతో ఇక్క‌డ అధికారం కాంగ్రెస్ ప‌ర‌మైపో యింది. కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు.. అవిశ్వాస తీర్మానం పెట్టారు.

ఈ అవిశ్వాస తీర్మానంలో బీఆర్ ఎస్ ఓడిపోయింది. దీంతో జాహ్న‌వి త‌న ప‌ద‌విని కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో మునిసిపాలిటీని కూడా బీఆర్ ఎస్ పోగొట్టుకుది. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.

మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవిపై కొన్నాళ్లుగా బీఆర్ ఎస్‌ పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేస్తున్నారు. అవిశ్వాసానికి పరోక్షంగా 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గానూ, కాంగ్రెస్‌కు 27, టీఆర్‌ఎస్‌కు 16, బీజేపీకి ఆరుగురు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో కోరం సరిపోక పోవడంతో కాంగ్రెస్ కు అనుకూలంగా 9మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు.

బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఈ 9మంది కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. బలపరీక్షలో జాహ్నవిని ఓడించడానికి బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేత అండగా ఉన్నార‌ని తెలుస్తోంది. అవిశ్వాసానికి అనుకూలంగా 27 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం నెగ్గింది. దీంతో కొత్త ఛైర్మన్‌గా గడ్డం ఇందుప్రియను ఎన్నుకున్నారు.