పార్టీ మార్పు పై జనసేన నేత సంచలన కామెంట్స్...!
ఏపీలో పాలిటిక్స్ హీటెక్కింది. ఎవరు ఏ వైపు ఉంటారు అన్నది కూడా తెలియడం లేదు. కీలక ఘట్టానికి పాలిటిక్స్ చేరుకుంది
By: Tupaki Desk | 26 Feb 2024 3:57 AM GMTఏపీలో పాలిటిక్స్ హీటెక్కింది. ఎవరు ఏ వైపు ఉంటారు అన్నది కూడా తెలియడం లేదు. కీలక ఘట్టానికి పాలిటిక్స్ చేరుకుంది. ఎవరైనా కూడా రాజకీయాల్లో పదవులు ఆశిస్తారు. అవి రానపుడు సహజంగానే అసంతృప్తి చెందుతారు. అయితే వర్తమాన రాజకీయాల తీరు చూస్తే అలా అసంతృప్తిగా ఉన్న వారు అంతా పార్టీ మారుతారు అని కూడా ప్రచారం సాగుతూ వస్తోంది.
అయితే ఈ తరహా ప్రచారాన్ని జనసేన కీలక నేత, రాజమండ్రి రూరల్ సీటు ఆశిస్తున్న కందుల దుర్గేష్ ఖండించారు. తాను పార్టీ మరే ప్రసక్తి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్నవి అన్నీ రూమర్స్ అని కూడా కొట్టిపారేశారు.
ఇక తాను రాజమండ్రి రూరల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని వస్తున్న వార్తలలో కూడా ఏ మాత్రం నిజం లేదని అన్నారు. తన సొంత స్వార్ధం కోసం ఈ విధంగా చేసే వ్యక్తిని కాను అని క్లారిటీ ఇచ్చారు. సో కందుల దుర్గేష్ ఈ రెండు విషయాల్లో పార్టీకి పూర్తి విధేయుడిగానే ఉన్నారు అని అంటున్నారు.
మరి ఆయన ఏం చేయబోతున్నారు అన్నదే ఉత్కంఠను రేకెత్తించే వ్యవహరంగా ఉంది. ఎందుకంటే ఆయనకు రాజమండ్రి రూరల్ సీటు కాకుండా నిడదవోలు నుంచి పోటీ చేయమని కోరారని ఆయనే చెప్పారు. ఇదే విషయం తాను కార్యకర్తలతో మాట్లాడుతున్నాను అని ఆయన చెప్పారు. క్యాడర్ తన అభిమానులు సహనం వహించాలని కూడా ఆయన కోరారు.
ఇదిలా ఉంటే తనకు రాజమండ్రి రూరల్ సీటు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేశారు అని మంత్రి వేణు గోపాల క్రిష్ణ అనడం పట్ల దుర్గేష్ రియాక్ట్ అయ్యారు. తన గురించి తన సీటు గురించి మంత్రి వేణు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. మొత్తానికి చూస్తే దుర్గేష్ ముందు నిడదవోలు ఆప్షన్ అయితే ఉంది. క్యాడర్ మాత్రం రాజమండ్రి రూరల్ విడిచి వెళ్లొద్దు అని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీని మీద ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.