Begin typing your search above and press return to search.

కర్ర తిప్పడం మొదలుపెడితే... బీజేపీ మహిళా అభ్యర్థి సామూ చూడాల్సిందే!

కాగా... ఇటీవల బీఆరెస్స్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన కందుల సంధ్యారాణికి ఆ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలోనే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది

By:  Tupaki Desk   |   24 Oct 2023 10:32 AM GMT
కర్ర తిప్పడం మొదలుపెడితే... బీజేపీ మహిళా అభ్యర్థి సామూ చూడాల్సిందే!
X

రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు అన్నీ శాసన సభ సమరానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో కొన్ని రాజకీయ పార్టీలలోని అసమ్మతి, అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. ఇందులో భాగంగా... పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, అనుచరులు కలిసి ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఈమె పేరు స్థానికంగా మారుమోగిపోతొంది.

అవును... ఈ నెల 18న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరిన కందుల సంధ్యారాణి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె కర్రసాములో ఎక్స్ పర్ట్. ఆమె కర్రసాముకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీలో చేరిన సంధ్యారాణి... తాజాగా తనదైన శైలిలో కర్ర తిప్పారు.

దసరా ఉత్సవాల్లో కర్రసాముతో అదరగొట్టారు రామగుండం బీజేపీ అభ్యర్థి, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. ఇందులో భాగంగా గోదావరి ఖనిలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆమె మోకాళ్లపై కూర్చొని తనదైన శైలిలో కర్రసాము చేసి అబ్బురపరిచారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా.. సంధ్యారాణికి యోగా, కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం ఉంది. ఇందుకు సంబందించిన పాత వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి!

కాగా... ఇటీవల బీఆరెస్స్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన కందుల సంధ్యారాణికి ఆ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలోనే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఇప్పటికే సంధ్యారాణి రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జెడ్పీటీసీగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈమె ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రచారంలో కొనసాగుతోన్నారు. ఈ సమయంలో... సంధ్యారాణికి బిజెపి అధిష్టానం టికెట్ కేటాయించడంతో రామగుండంలో రాజకీయం మరింత రసవత్తంగా మారనుంది.

ఇప్పటికే బీఆరెస్స్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరుకంటి చందర్ బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ఇటీవల టికెట్ ప్రకటించింది. ఇదే సమయంలో... రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారని అంటున్నారు. దీంతో రామగుండం నియోజకవర్గంలో ఈ నలుగురి మధ్య తీవ్ర పోటీ నెలకోనుందని అంటున్నారు.