Begin typing your search above and press return to search.

50 LIC పాలసీలు తీసుకున్న క్వీన్ కంగ‌న‌

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఏదో ఒక వివాదంతో నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక మంచి కార‌ణంతో హెడ్ లైన్స్ లో కొచ్చింది

By:  Tupaki Desk   |   16 May 2024 12:30 AM GMT
50 LIC పాలసీలు తీసుకున్న క్వీన్ కంగ‌న‌
X

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఏదో ఒక వివాదంతో నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక మంచి కార‌ణంతో హెడ్ లైన్స్ లో కొచ్చింది. ఏమిటా మంచి కార‌ణం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి...

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి లోక్‌సభకు బిజెపి అభ్యర్థి అయిన న‌టి కంగనా రనౌత్ మంగళవారం త‌న‌కు మొత్తం రూ.91 కోట్లకు పైగా ఆస్తులున్నాయ‌ని వివ‌రాలు వెల్లడించారు. ఈ ఆస్తులలో రూ.28.7 కోట్ల మూవ‌బుల్ ఆస్తులు .. రూ.62.9 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 18 కోట్ల అప్పులు కూడా చెల్లించాల్సి ఉందని జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కంగ‌నకు దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.50 లక్షల విలువైన వెండి.. రూ.3 కోట్ల విలువైన 14 క్యారెట్ల డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. రనౌత్ జిరాక్‌పూర్, చండీగఢ్, మనాలి (కులు), ముంబై బాంద్రాలో కూడా ఆస్తులున్నాయి. కంగ‌న‌ మనాలి అపార్ట్‌మెంట్ ఖరీదు రూ.4.97 కోట్లు.. ముంబై బాంద్రా ఆస్తి విలువ రూ.23.98 కోట్లు.

రూ.3.91 కోట్ల విలువైన BMW .. రెండు మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు త‌న‌కు ఉన్నాయ‌ని కంగ‌న పేర్కొంది. రూ.21 లక్షలు షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డిగా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 11 మందికి వ్యక్తిగత రుణాలు ఇచ్చారు. అంతేకాదు.. కంగ‌న‌కు 50 ఎల్‌ఐసి పాలసీలు కూడా ఉన్నాయి. ఆమె ఆస్తుల వార్తను ప్రకటించిన వెంటనే నెటిజ‌నులు కొంత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు. కంగ‌న‌ ఆస్తులపై నోరెళ్ల‌బెడుతూనే, ప్రత్యేకంగా 50 LIC పాలసీల గురించి విని చాలా మంది ఆశ్చర్యపోయారు.

లైవ్ మింట్ నివేదిక‌ ప్రకారం.. మతపరమైన భావాలను కించపరిచినందుకు మూడు క్రిమిన‌ల్ కేసులు.. పరువు నష్టం కోసం నాలుగు క్రిమిన‌ల్ కేసులు కంగ‌న‌పై ఉన్నాయి. ఓవ‌రాల్ గా ఎనిమిది క్రిమినల్ కేసులు కంగ‌న‌పై దాఖలయ్యాయని వెల్ల‌డైంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజక వర్గానికి జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఇది పార్లమెంటరీ ఎన్నికల‌ చివరి (ఏడ‌వ‌ది) రౌండ్ పోలింగ్. నామినేష‌న్ అనంత‌రం కంగ‌న మాట్లాడుతూ.. ఈరోజు మండి నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయం.. బాలీవుడ్‌లో విజయం సాధించి రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానన్న ఆశాభావంతో ఉన్నాను అని కంగనా రనౌత్ మీడియాతో వ్యాఖ్యానించారు.

నాపై మండి ప్ర‌జ‌ల‌ ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముద్ర వేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మండిలో భ్రూణహత్య సంఘటనలు ఎక్కువగా జ‌రిగాయి. ఈ రోజు మండి నుండి చాలా మంది మహిళలు సైన్యంలో, విద్య , రాజకీయ రంగంలో ఏల్తున్నార‌ని కంగ‌న అన్నారు.