Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై రాయి దాడి.. క్యాట్‌బాల్ కాదు.. చేత్తోనే: సీపీ

అయితే.. విద్యుత్ కోత‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగా తీసేసిన‌వి కావ‌ని.. ప్రొటోకాల్ ప్ర‌కార‌మే.. క‌ట్ చేశామ‌న్నారు. ''సీఎం త‌ర‌చుగా బ‌స్సుపై ఎక్కి ప్ర‌సంగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 April 2024 3:37 PM GMT
జ‌గ‌న్‌పై రాయి దాడి.. క్యాట్‌బాల్ కాదు.. చేత్తోనే:  సీపీ
X

ఏపీ సీఎం జ‌గ‌న్ పై శ‌నివారం రాత్రి విజ‌య‌వాడ శివారులో జ‌రిగిన రాయిదాడి ఘ‌ట‌న‌పై తాజాగా ఎన్టీఆర్ జిల్లా(విజ‌య‌వాడ‌) పోలీసు క‌మిష‌న‌ర్ కాంతి రాణా వివ‌ర‌ణ ఇచ్చారు. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. రెండు రోజుల‌కు మీడియా ముందుకు వ‌చ్చిన సీపీ.. జ‌గ‌న్‌పై రాయి ఘ‌ట‌న చేత్తో జ‌రిగింద‌నేన‌ని తేల్చి చెప్పారు. దీనిని క్యాట్ బాల్‌తో ప్ర‌యోగించ‌లేద‌న్నారు. ''బ‌ల‌మైన వ్య‌క్తి ఎవ‌రో బ‌లంగా రాయి విసిరారు. దీని వెనుక దురుద్దేశం ఉంది. ముఖ్య‌మంత్రే టార్గెట్ అని దాదాపు నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది'' అని రాణా వివ‌రించారు.

భ‌ద్ర‌త‌పై

సీఎం భ‌ద్ర‌త‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను రాణా కొట్టి పారేశారు. ముఖ్య‌మంత్రికి ప్రొటోకాల్ ప్ర‌కార‌మే భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో తాము తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్న‌ట్టు రాణా వివ‌రించారు. స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ నుంచి 4 ప్లాటూన్ల బలగాలను, వాటికితోడు ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ వింగ్ వంటివాటిని సీఎం జ‌గ‌న్ కోసం ప్ర‌త్యేకంగా కేటాయించిన‌ట్టు తెలిపారు. కాబ‌ట్టి.. సీఎం జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త ప‌రంగా ఎలాంటి లోపం జ‌ర‌గ‌లేద‌న్నారు.

క‌రెంట్ క‌ట్‌పై..

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో విద్యుత్ కోత‌ల‌పై విప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తాము ప‌ట్టించుకోబోమ‌ని.. సీపీ టాటా తెలిపారు. అయితే.. విద్యుత్ కోత‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగా తీసేసిన‌వి కావ‌ని.. ప్రొటోకాల్ ప్ర‌కార‌మే.. క‌ట్ చేశామ‌న్నారు. ''సీఎం త‌ర‌చుగా బ‌స్సుపై ఎక్కి ప్ర‌సంగిస్తున్నారు. కొద్ది దూరం ప్ర‌యాణం కూడా చేస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకునే బాధ్య‌త విద్యుత్ శాఖ‌పై ఉంది. అందుకే.. ఆయ‌న బ‌స్పుపై నిల‌బ‌డిన‌ప్పుడు ఆ యా ప్రాంతాల్లో విద్యుత్ క‌ట్ చేస్తున్నారు. ఇక‌, ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు, ఈదురుగాలుల కార‌ణంగా కూడా విద్యుత్‌ను నిలిపివేశారు. ఇది కావాల‌ని చేసింది కాదు'' అని రాణా వెల్ల‌డించారు. విజ‌య‌వాడ‌లోనూ ఇలానే జ‌రిగింద‌న్నారు.

ఫుటేజీ ప‌ట్టేశాం..

సీఎం జ‌గ‌న్‌, మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుల‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని స‌మ‌గ్రంగా స్వాధీనం చేసుకున్న‌ట్టు సీపీ టాటా వెల్ల‌డించారు. అయితే.. దీనిని మ‌రింత నిర్దిష్టంగా నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌కు పంపించామ‌న్నారు. అదేవిధంగా మిడియా వాళ్లు తీసిన వీడియోలు, కొందరు సెల్ ఫోన్లలో తీసిన వీడియో ల‌ను కూడా స్వాధీనం చేసుకుని ప‌రిశీలించిన‌ట్టు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. ఒక వ్యక్తి బలంగా రాయి విసిరినట్టు గుర్తించామ‌న్నారు.