Begin typing your search above and press return to search.

కేఏ పాల్ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలివే!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లలో కేఏ పాల్ ఒకరని చెప్పినా అతిశయోక్తి కాదు

By:  Tupaki Desk   |   19 April 2024 6:07 AM GMT
కేఏ పాల్ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలివే!
X

నామినేషన్ల పర్వం మొదలవ్వగానే ఏపీలో ఎన్నికల సందడి మరింత ఎక్కువైంది. ఈ సమయంలో తొలిరోజే పలువురు కీలక నేతలు నామినేషన్లు వేయగా.. రెండో రోజు మరింత ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయడం కొనసాగుతోందని తెలుస్తోంది! ఈ సమయంలో మరోసారి కేఏ పాల్ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఆయన అఫిడవిట్ లో వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లలో కేఏ పాల్ ఒకరని చెప్పినా అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో.. రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఆస్తులను ప్రకటించారు.

తాజాగా కేఏ పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులతో పాటు కేసుల వివరాలనూ వెల్లడించారు. ఇందులో భాగంగా... తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించిన ఆయన.. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇక విద్యార్హత విషయానికొస్తే... డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పాల్ వెల్లడించారు.

ఇదే సమయంలో తనపై.. మహబూబ్ నగర్, ఒంగోలు, ఎస్ కోట, రాజన్న సిరిసిల్ల జిల్లా, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులు ఉన్నట్లు వెల్లడించారు!

కాగా 2019 ఎన్నికల సమయంలో మార్చి నెలలో నాడు సమర్పించిన అఫిడవిట్ లో చాలా భాగం ఖాళీగా వదిలేశారనే చర్చ జరిగింది. విశాఖపట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చిన పాల్.. కులం, మతం లాంటి వివరాలేవీ రాయలేదని.. ఇదే క్రమంలో... తన చేతిలో రూ.30 వేల రూపాయల క్యాష్ మాత్రమే ఉందని చెప్పి.. ఇతర ఆస్తులు, అప్పుల వివరాలేవీ వెల్లడించలేదు!!