Begin typing your search above and press return to search.

కాపులకు ఒక పార్టీ ఉండాల్సిందేనా ?

ఏపీలో మళ్ళీ రాజకీయ మధనం సాగుతోంది. అది సామాజిక రాజకీయ మధనంగా ఉంది. నిజం చెప్పాలంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయం ఒక ఎత్తు.

By:  Tupaki Desk   |   1 April 2025 1:30 PM
Key Role of Kapu Community in Shaping Future Elections
X

ఏపీలో మళ్ళీ రాజకీయ మధనం సాగుతోంది. అది సామాజిక రాజకీయ మధనంగా ఉంది. నిజం చెప్పాలంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయం ఒక ఎత్తు. ఏపీలో రాజకీయం మరో ఎత్తు. ఏపీలో పాలిటిక్స్ అంటేనే కులాల సంకుల సమరం. లెక్కలు అన్నీ ఇక్కడ పక్కగా ఉంటాయి. తేడా వస్తే అంతా రివర్స్ కూడా అవుతుంది మరి.

ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ రాజకీయం ఎపుడూ హాట్ గానే సాగుతూ వస్తోంది. ఇక చూస్తే కనుక ఉమ్మడి ఏపీని అనేక మంది సీఎంలు పాలించారు. కానీ వారిలో కాపుల నుంచి ఒక్కరూ ప్రాతినిధ్యం అయితే లేదు. నిజానికి ఏపీలో కాపులు చాలా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. జనాభా పరంగా చూసినా వారు చాలా చోట్ల బలంగా ఉంటారు.

సుమారు డెబ్బై అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో వారి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకంగా ఉంటుంది. అంటే గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న మాట. అంతవరకూ ఎందుకు చరిత్ర ఒక్కసారి తిరగేస్తే చాలు కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే గెలిచాయి. వారి ఆగ్రహానికి గురి అయినవి ఓటమి బాట పట్టాయి.

మరీ ముఖ్యంగా 1983 నుంచి చూస్తే కాపుల పాత్ర ఏపీలో అతి కీలకంగా మారింది. వారు ఏ పార్టీతో కలసి నడిస్తే వారికి అధికారం దక్కి తీరుతుంది అన్నది రుజువు అయింది. 1983, 1985లలో టీడీపీతో నడచిన కాపులు 1989లో కాంగ్రెస్ వెంట ఉండి గెలిపించారు. అలాగే 1994, 1999లలో టీడీపీ వైపు ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ని గెలిపించిన కాపులు 2009లో ప్రజారాజ్యం వెంట సాగారు. 2014లో తిరిగి టీడీపీ బీజేపీ కాంబోని ఏపీలో గెలిపించడంలో వారిది ముఖ్య పాత్ర.

ఇక 2019లో వైసీపీ గెలుపు వెనక కాపులది అతి ప్రధాన పాత్ర. 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. కూటమిని గెలిపించిన కాపులు వైసీపీని గద్దె దించేశారు. ఇవన్నీ కూడా కాపుల రాజకీయ ప్రాబల్యాన్ని పలుకుబడిని తెలియచేస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో కాపులకు అధికారం మాత్రం అందరి పండు అవుతోంది.

విభజన ఏపీలో వారు సులువుగా అధికారం అందుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ 88 అయిన చోట 75 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయ పలుకుబడి కలిగిన కాపులకు సీఎం పీఠం దక్కడం ఒక విధంగా ఈజీనే అని అంటారు. కానీ ఏపీలో చూస్తే రాజకీయ సమీకరణలు మాత్రం వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

ఏదో ఒక ప్రధాన పార్టీకి మద్దతుగా ఉంటూ పదవులు అందుకోవడమే తప్పించి ముఖ్యమంత్రి సీటుని తాము దక్కించుకోలేకపోతున్నామన్న వేదన వారిలో ఉంది. ఈ రోజు ఏపీలో కూటమి గెలుపు వెనక కాపులు ఉన్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి జనసేనకు దక్కింది. ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాపులు ఆలోచించడంలేదు ఈ పదవి వైసీపీ టీడీపీలు గతంలోనూ ఇచ్చి ఉన్నాయి అని గుర్తు చేస్తున్నారు.

కాపులు రాజకీయంగా కీలకం అయినపుడు గెలుపులో వారి పాత్ర అతి ముఖ్యమైనపుడు రాజకీయ బేరసారాలుతో సీఎం సీటుని సాధించుకోవాలన్నదే కాపు పెద్దల ఆలోచన. జనసేన అయితే సీఎం చంద్రబాబుని మరింతకాలం ఆ పదవిలో చూడాలని అనుకుంటోంది. ఆయనను సత్తా ఉన్న నాయకుడిగా చూస్తోంది. ఆయన వల్లనే ఏపీ అభివృద్ధి అని భావిస్తోంది.

దాంతో ఏపీలో కాపులు అందలం ఎక్కాలీ అంటే మరో దశాబ్దన్నర కాలం వేచి చూడాలా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక రాజకీయంగా చూసినా ఒకరిద్దరికి పదవులు ఇచ్చేస్తే మొత్తం సామాజిక వర్గం మేలు జరిగింది అన్న భావన సరికాదు అన్నది కూడా ఉంది. తాము కూడా ముఖ్యమంత్రులు కావాలని తమ హవా కొనసాగాలన్నదే కాపుల ఆలోచనగా చెబుతున్నారు.

ఇంకో వైపు చూస్తే కాపులకు పదవులు అంటే జనసేనకు కోటా ఇచ్చేసి మిగిలిన సామాజిక వర్గాలకు టీడీపీలో సర్దుతున్న నేపథ్యం ఉంది. దాంతో టీడీపీలో కాపులు రగులుతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వైసీపీలో కూడా కాపులు దారి తెన్నూ తెలియక ఉన్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడిగా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన చరిష్మా టిక్ లీడర్ గా ఉన్న వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో కాపుల కోసం కొత్త పార్టీ మొదలవుతుందా అన్న చర్చ అయితే ఉంది.

మొదట ఇది పుకారుగా బయల్దేరినా ఇది ఇపుడు చర్చకు తావిస్తోంది. దాంతో మరో నాలుగేళ్ళలో ఏపీలో జరిగే ఎన్నికల లోగా ఈ పుకారు నిజమవుతుందని బలమైన రాజకీయ బీజం పడి కాపుల కోసం ఒక పార్టీగా ముందుకు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు అదే జరిగితే కనుక ఏపీలో రాజకీయ సమీకరణలు మొత్తం సామాజిక పరంగా మారిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.