Begin typing your search above and press return to search.

బిగ్ క్వశ్చన్... నిజంగానే మనోడు ప్యాకేజీ స్టార్ అంటావా అన్నా..?

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాపు సమాజంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ప్రశ్న ఇది! కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కానీ... జనసేన అధ్యక్షుడు మాత్రం కాపులను ఓన్ చేసుకోలేదా..?

By:  Tupaki Desk   |   24 Feb 2024 11:30 PM GMT
బిగ్  క్వశ్చన్... నిజంగానే మనోడు ప్యాకేజీ స్టార్  అంటావా అన్నా..?
X

టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు విడుదల చేశారు. ఈ సమయంలో సీట్ల కేటాయింపులో తేడాలున్నా వేదికపై మాత్రం ఇరు పార్టీల నుంచీ ముగ్గురు ముగ్గురు చొప్పున కుర్చున్నారు. ఈ సమయంలో 118 సీట్లకు ప్రకటించిన చంద్రబాబు... అందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మిగిలిన 24 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే... 118 లో 24 కాదు... 175 లో 24 అనే విషయాన్ని తలచుకున్న కాపులకు ఒక కొత్త సందేహం వచ్చిందని అంటున్నారు.

అవును... "కాపులకు 175లోనూ కనీసం 50 - 60 స్థానాలు కేటాయించకపోతే పొత్తు వృథా.. రిజర్వేషన్స్ విషయంలో చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకు తోడు పవన్ కల్యాణ్ కూడా కలిపి కాపులకు పెద్ద పోటు పొడిచినట్లే అవుతుంది.. ఇది కాపుల స్థాయిని తగ్గించడమే కాదు, వారి స్థాయిని ఎద్దేవా చేయడం కూడా" అని పలువురు భావించారు! అయితే తాజాగా అనుకున్నంతా అయ్యింది.. కాపులకు.. కాదు కాదు.. జనసేనకు 24 సీట్లు విదిల్చారు చంద్రబాబు! మహాప్రసాదం అని స్వీకరించారు పవన్ కల్యాణ్!

అంటే... పవన్ కల్యాణ్ పేరు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుల ఓట్లు గంపగుత్తగా పోందాలనుకున్న చంద్రబాబు హ్యాపీ... గతంలో రెండు చోట్లా ఓడిపోయిన తనను, ఒక్క చోట గెలిచిన తన పార్టీని "అన్ని విధాలా" గౌరవించి 24 సీట్లు ఇచ్చారన్నట్లుగా ఫీలవుతున్న పవన్ కూడా హ్యాపీ... మరి జనసేన అంటే టీడీపీ బీ టీం అని అంటున్నా... దానికి అధ్యక్షుడు పవన్ అయినా అధినేత చంద్రబాబు అనే సెటైర్లు పడుతున్నా... కాదు కాదు... జనసేన కాపుల పార్టీ అని నమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని, రాజ్యాధికారం వస్తుందంటూ ఎదురుచూసిన వారి పరిస్థితి ఏమిటి?

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాపు సమాజంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ప్రశ్న ఇది! కాపులు జనసేనను ఓన్ చేసుకున్నారు కానీ... జనసేన అధ్యక్షుడు మాత్రం కాపులను ఓన్ చేసుకోలేదా..? మనం ఒంటరిగా పోటీ చేసినా 40 స్థానాల్లో గెలుస్తామని ఇంతకాలం చెప్పుకున్న పవన్... 24 సీట్లకు ఒప్పేసుకుని, టీడీపీ కోసం మాత్రం మిగిలిన 151 స్థానాల్లోనూ కాపులు జెండా మోయాలని కోరడం దేనికి సంకేతం..? కాపులు తాను ఏది చెబితే అది చేస్తారు.. తాను లోకేష్ ని చంద్రబాబుని తిడితే తిడతారు.. లేదు టీడీపీకి జై అంటే జై అంటారు అని భావిస్తున్నారా..?

ఇవన్నీ నిన్నమధ్యాహ్నం నుండి కాపు సమాజంలో బలంగా తిరుగుతున్న ప్రశ్నలు అని తెలుస్తుంది. తాజాగా గోదావరి జిల్లాలో ఇద్దరు కాపు యువకుల మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. సుమారు 40 నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేసినా గెలుస్తామని పలికిన పలుకులు.. ఇప్పుడు 24 కి ఒప్పుకున్న వైనంపై జరిగిన చర్చ ఈ విధంగా ఉంది!!

"జనసేన కోసం ఎన్ని చేశామన్నా..? ఎంత చేశామన్నా..? మరీ దారుణంగా 24 సీట్లకు ఒప్పేసుకోవడం ఏమిటన్నా..? నిజంగానే మనోడు ప్యాకేజీ స్టార్ అంటావా అన్నా..? మనం కనీసం 50 స్థానాల్లో కూడా గెలుపు నిర్ణయించే స్థితిలో లేమా అన్నా..? ఆ విషయం మనోడుకి కి తెలియదా అన్నా..? సింగిల్ గా 40 గెలుస్తామని చెప్పి ఇప్పుడు ఇదేమిటన్నా..? చంద్రబాబు - నాదెండ్ల - మనోడు ఆడిన డ్రామాలో మనం బలిపశువులం అయ్యామా అన్నా..? ఇంక వద్దులే అన్నా.. జనసేన లేదు ఏమీ లేదు..!" ఈ స్థాయిలో కాపు సమాజంలో నైరాశ్యం వచ్చేసిందని తెలుస్తుంది!!