జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం... వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్ ఛార్జ్ ల ఎంపికలో జగన్ సరికొత్త విధానం చేపట్టిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 8 Feb 2024 2:15 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్ ఛార్జ్ ల ఎంపికలో జగన్ సరికొత్త విధానం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పలు రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భారీ స్థాయిలో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపట్టారు. దీంతో చాలా మంది రెబల్స్ గా, అసంతృప్తులుగా తెరపైకి వచ్చారు. వీరిలో ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒకరు. ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... వైసీపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన కాపు రామచంద్రారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తనకు అన్యాయం జరిగిందని చెబుతూనే.. జగన్ మీద తన కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. ఇదే సమయంలో ఆయనపై తనకున్న అభిమాన్ని తెలుసుకోవాలంటే... ఇంటికి వస్తే మరింత బాగా తెలుస్తుందన్నట్లుగా స్పందించారు.
ఇందులో భాగంగా... తన ఇంటికి వెళ్తే ఎటు చూసినా వైఎస్సార్, వైఎస్ జగన్ ల ఫోటోలే ఉంటాయని.. ఇంట్లో ఓదార్పు యాత్ర పాటలు కూడా వినిపిస్తుంటాయని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని కాపు రామచంద్రా రెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీనుంచి పోటీ చేసేదీ ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు.
తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన టీడీపీ ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి టీతాగుతూ కబుర్లు చెప్పారు!!అనంతరం.. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ కన్ఫామే కానీ... ఇండిపెండేంట్ గానా.. లేక, మరేదైనా పార్టీ నుంచా అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.
ఈ క్రమంలోనే... వచ్చే ఎన్నికల్లో తాను ఎలా పోటీచేసినా కూడా జగన్ కు వ్యతిరేకంగా మాత్రం ప్రచారం చేసుకోనని అన్నారు. తనకొక ఇమేజ్ ఉందని.. దాన్ని వదులుకోమని తెలిపారు. ఇక జగన్ కు వ్యతిఏకంగా ప్రచారం చేస్తే.. వెయ్యి ఓట్లుకు మించి రావని కాపు చెప్పడం గమనార్హం! దీంతో... జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవడం వల్ల ఓట్లు ఎక్కువగా రాకపోవచ్చని, తన గురించి ప్రచారం చేసుకుంటేనే నాలుగు ఓట్లు వస్తాయని కాపు భావిస్తున్నారని అంటున్నారు!!