Begin typing your search above and press return to search.

కాపులు.. కూట‌మికి బాగా క‌లిసి వ‌స్తున్నారా?

గ‌డిచిన రెండు ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. 2014లో గుండుగుత్త‌గా .. కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నా రు.

By:  Tupaki Desk   |   3 May 2024 5:07 AM GMT
కాపులు.. కూట‌మికి బాగా క‌లిసి వ‌స్తున్నారా?
X

ఏపీ రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకుంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గం వైసీపీ వైపు ఉంటే.. క‌మ్మ వ‌ర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే.. ఎటొచ్చీ.. జ‌నాభాలో ముందున్న కాపుల ప‌రిస్థితే ఎప్పుడు త‌ర్జ‌న భ‌ర్జ‌నగా ఉంటోంది. తాజా లెక్క‌ల ప్ర‌కారం కాపులు-బ‌లిజ‌లు(సీమలో) మొత్తంగా జ‌నాభా 52.70 ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు సుమారు 42 ల‌క్ష‌ల కు పైగానే ఉంది. దీంతో వీరు ఎప్పుడూ ఎన్నికల్లో కీల‌క పాత్ర‌నే పోసిస్తున్నారు.

గ‌డిచిన రెండు ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. 2014లో గుండుగుత్త‌గా .. కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నా రు. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో కూట‌మిగా బ‌రిలో ఉన్న టీడీపీ-బీజేపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీ జ‌న‌సేన‌ను పెట్టుకున్నా.. పోటీలో లేకుండా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న చెప్పిన‌ట్టుగా కాపులు.. టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఫ‌లితంగాకాపుల బెల్టు ఎక్కువ‌గా ఉన్న తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. ఇది ఆ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చింది.

ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. మాత్రం సీన్ మారింది. 2014-19 మ‌ధ్య జ‌రిగిన కాపు ఉద్య‌మం, ప్ర‌భు త్వం నుంచి స‌రైన హామీలు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆఎన్నిక‌ల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు. దీంతో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కాపులు ఎటువైపు నిలుస్తార‌నేది అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉన్న కాపులు.. ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కూట‌మికి కాపులు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌లంగా నిల‌బ‌డ డం.. వైసీపీపై పోరాటం చేస్తుండ‌డంతోపాటు.. మెగా కుటుంబం మొత్తంగా రంగంలోకి దిగి ప్ర‌చారం చేయ‌డం.. కాపుల‌కు ఒకింత ఉత్సాహంగా ఉంది. పైగా.. కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో ప‌వ‌న్ కీల‌క‌మ‌నే ప్ర‌చారాన్ని టీడీపీ స‌హా.. ప‌వ‌న్ బాగా చెబుతున్నారు. ఇక‌, సీట్లు త‌గ్గాయ‌న్న ఆవేద‌న ఉన్నా.. ఎందుకు త‌గ్గించుకున్నార‌నే వివ‌ర‌ణ‌కు వారు సంతృప్తి చెందారు. మ‌రోవైపు.. ప‌వ‌న్ ఈ సారి త‌న‌ను గెలిపించాల‌ని కోరుతుండ‌డం కాపుల‌కు సెంటిమెంటుగా మారింది.

మ‌రోవైపు.. కూట‌మిలోనే కాకుండా.. టీడీపీలోనూ ప‌వ‌న్‌కు ప్రాధాన్యం పెరిగింది. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. ఎవ‌రు అంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నారా లోకేష్ పేరు వినిపించింది. కానీ, ఇటీవ‌ల కాలంలో నారా లోకేష్‌ను కూడా త‌ప్పించి.. త‌గ్గించి.. ప‌వ‌న్‌కు ప్రాధాన్యం పెంచుతున్నారు. మేనిఫెస్టో విడుద‌ల కార్య‌క్ర‌మంలోను.. గ‌తంలో జ‌రిగిన తాడేపల్లి గూడెం ఉమ్మ‌డి స‌భ‌లోనూ, ప్ర‌ధాని పాల్గొన్న చిల‌క‌లూరి పేట స‌భ‌లోనూ నారా లోకేష్‌ను త‌ప్పించారు. ఈ స్థానంలో ప‌వ‌న్‌ను చేర్చారు.

ఇది.. కాపుల‌కు ఆశించిన మేర‌కు సంతృప్తి నిచ్చింది. దీంతో రేపు ప్ర‌భుత్వంలోనూ ప‌వ‌న్ కీల‌కంగా మార‌నున్నార‌ని వారు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. మొత్తంగా చూస్తేమారుతున్న ప‌వ‌నాల‌కు అనుకూలంగా జ‌న‌సేన‌, టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. త‌న‌కు కేంద్రంలోని పెద్ద‌ల‌తోనూ.,. మంచి స్నేహం ఉంద‌ని చెప్ప‌డం వంటివికాపులు టీడీపీవైపు.. కూట‌మివైపు నిల‌బ‌డేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.