Begin typing your search above and press return to search.

కర్ణాటక : గ్యారంటీల మోత .. పన్నుల వాత !

ఈ నేపథ్యంలో ఆదాయం కోసం వివిధ రకాల పన్నులు వేస్తూనే పథకాల అమలులో లబ్దిదారులను తగ్గించేందుకు ఆంక్షలను విధిస్తున్నది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:14 AM GMT
కర్ణాటక : గ్యారంటీల మోత .. పన్నుల వాత !
X

అయిదు గ్యారంటీల హామీలతో కర్ణాకలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వాటి అమలుకు ఆపసోపాలు పడుతుంది, వాటిని అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.52 వేల కోట్ల భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం వివిధ రకాల పన్నులు వేస్తూనే పథకాల అమలులో లబ్దిదారులను తగ్గించేందుకు ఆంక్షలను విధిస్తున్నది.

తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. పెట్రోల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను 25.92 నుంచి 29.84 శాతానికి (3.92 శాతం పెరుగుదల), డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి (4.1 శాతం పెరుగుదల) పెంచింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3, లీటర్‌ డీజిల్‌ ధర రూ.3.02 మేర పెరిగింది. తాజా పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. సేల్స్‌ ట్యాక్స్‌ పెంపుతో ఏటా రాష్ట్ర ఖజానాకు రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

‘ఉచిత విద్యుత్తు’ అందించే ‘గృహలక్ష్మి’ స్కీమ్‌ అమలులో ఆంక్షలు,, ఉచిత బస్సు పథకం విషయంలో బస్సులు తగ్గించడం, నిరుద్యోగ భృతి, ఉచిత బియ్యం పథకం అన్నభాగ్యలో కోతలు విధిస్తూ వస్తున్నది. ఈ ఏడాదిలో కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ – 4 శాతం, గైడెన్స్‌ వాల్యూ ట్యాక్స్‌ – 15 నుంచి 30%, దేశీయ లిక్కర్‌పై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ – 20 శాతం, బీర్లపై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ – 175 నుంచి 185 శాతం, కొత్తగా రిజిస్టరైన రవాణా వాహనాలపై అదనపు సెస్‌ – 3 శాతం, రూ.25 లక్షల పైబడిన ఎలక్ట్రికల్‌ వాహనాలపై లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌ విధించడం జరిగింది.