Begin typing your search above and press return to search.

ఇద్దరు భార్యలు ఉన్నా .. పెన్షన్ కు అర్హులే.. తేల్చేసిన ఆ హైకోర్టు

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు అనుగుణంగానే తాము ఆదేశాలు ఇస్తున్నట్లుగా హైకోర్టు స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:15 AM GMT
ఇద్దరు భార్యలు ఉన్నా .. పెన్షన్ కు అర్హులే.. తేల్చేసిన ఆ హైకోర్టు
X

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు అనుగుణంగానే తాము ఆదేశాలు ఇస్తున్నట్లుగా హైకోర్టు స్పష్టం చేసింది. రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలున్నా.. వారందరికి ఆశాఖ నిబంధనల ప్రకారం ఫించను పొందే అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఫించన్ మొత్తాన్ని సమానంగా ఇద్దరు భార్యలకు పంచాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు.

రైల్వే సేవల నిబంధనల ప్రకారం రమేశ్ బాబు అనే రైల్వే ఉద్యోగికి ఇద్దరు భార్యలు. వారిద్దరికి సమానంగా పింఛన్ పంచాలన్న న్యాయమూర్తి ఆదేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మరాయి. నైరుతి రైల్వే సీనియర్ డివిజనల్ పర్సనల్ మేనేజర్ కార్యాలయంలోని ట్రాఫిక్ విభాగంలోరమేశ్ బాబు పని చేస్తుండేవారు. ఆయనకు ఒక భార్య.. ముగ్గురు పిల్లలు. తిరుపతిలో పుష్ప అనే మహిళను 1999 డిసెంబరు 9న పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమార్తె ఉంది. రమేశ్ బాబు 2021 మే నాలుగున మరణించారు. భర్త మరణంతో రావాల్సిన పింఛన్ ను.. ఇతర ప్రయోజనాల్ని తనకు అందించాలని..కారుణ్య నియామకం ద్వారా తన రెండో కుమార్తెకు జాబ్ ఇవ్వాలని మొదటి భార్య రైల్వే అధికారులకు సూచన చేశారు.

అదే సమయంలో తనకూ పింఛన్ ఇవ్వాలని రెండో భార్య పుష్ప కూడా కోరారు. ఇద్దరికి పింఛన్.. ఇతర సదుపాయాల్ని అధికారులు నిలిపేశారు. కోర్టు నుంచి స్పస్టమైన ఆదేశం వస్తేనే తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రమేశ్ బాబు మొదటి భార్య ఫ్యామిలీ కోర్టును ఆదేశించారు. ఇదే అంశంపై రెండో భార్య కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పింఛన్ లో సగం ఇద్దరు భార్యలకు చెల్లించాలని 2022 జులై 22న కోర్టు రైల్వే అధికారులకు ఆదేశించింది. రైల్వే సర్వీసు నిబంధనల ప్రకారం ఉద్యోగి భార్యలకు సమానంగా పింఛన్ ఇవ్వాలని రైల్వే అధికారులకు జడ్జి స్పష్టం చేశారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.