Begin typing your search above and press return to search.

గేదె కోసం గొడవలో డీఎన్ఏ టెస్ట్ కోరిన పోలీసులు... ఏమీ కథ?

అవును... కర్ణాటకలోని దేవనగరి జిల్లాలో వందలాది మంది ప్రజలు గేదెను పూజిస్తారు. ఈ క్రమంలో ఓ దేవాలయానికి చెందిన గేదె విషయంలో రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 2:45 AM GMT
గేదె కోసం గొడవలో డీఎన్ఏ  టెస్ట్  కోరిన పోలీసులు... ఏమీ కథ?
X

ఒక గేదె కోసం రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఈ గేదె తమదంటే తమదంటూ వాదించుకున్నారు. దీని వయసు ఎనిమిదేళ్లు అని, ఇది తమదని ఒకరంటే.. కాదు, ఈ గేదె వయసు మూడేళ్లే.. ఇది తమది అని మరో ఊరి ప్రజలు వాదులాటకు దిగారు. దీంతో వ్యవహారం చినికి చినికి సీరియస్ గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

అవును... కర్ణాటకలోని దేవనగరి జిల్లాలో వందలాది మంది ప్రజలు గేదెను పూజిస్తారు. ఈ క్రమంలో ఓ దేవాలయానికి చెందిన గేదె విషయంలో రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఇందులో భాగంగా.. కునిబెలకర్ గ్రామంలోని కరియమ్మ దేవి వద్ద ఈ గేదె ఎనిమిదేళ్లుగా ఉందని ఆ గ్రామస్తులు చెబుతుండగా.. కులగట్టే గ్రామ ప్రజల వెర్షన్ మరోలా ఉంది.

ఇందులో భాగంగా... ఈ గేదె తమ గ్రామానికి చెందినదని.. ఈ గేదె రెండు నెలల క్రితం తప్పిపోయిందని కులగట్టే గ్రామ ప్రజలు చెబుతున్నారు. దీంతో.. గేదె విషయంలో ఈ రెండు గ్రామాల ప్రజల మధ్య వాతావరణం వేడెక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా... ఈ గేదె ఎవరిదని నిర్ధారించే క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్నారు.

ఈ సమయంలో... గేదె వయసు ఎనిమిదేళ్లు అని, ఎనిమిదేళ్లుగా తమ వద్దే ఉంటుందని కునిబెలకర్ గ్రామ ప్రజలు చెప్పగా... గేదె వయసు మూడేళ్లే అని, మూడు నెలల క్రితం తప్పిపోయిందని కులగట్టే గ్రామ ప్రజలు వాదిస్తున్నారు. ఈ సమయంలో గేదే వయసు ఎంతో నిర్ధారించే కార్యక్రమం మొదలుపెట్టారు పశువైద్యులు.

ఈ క్రమంలో... గేదె వయసు ఆరేళ్లు అని తేలిందని అంటున్నారు. దీంతో... వైద్యులు చెప్పిన గేదె వయసు కునిబెలకర్ వాదనకు సమీపంగ ఉందని అంటుండగా.. అందుకు కులగట్టె గ్రామ ప్రజలు అంగీకరించడం లేదు. దీంతో... పోలీసులు ఓ కీలక ఆలోచన చేశారు. ఇందులో భాగంగా.. గేదెకు డీఎన్ఏ టెస్ట్ ను కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన దేవనగరి జిల్లా ఏఎస్పీ... గేదె నమూనాలను సేకరించామని.. త్వరలో ఆ గేదె ఎవరిది అనే విషయంపై క్లారిటీ వస్తుందని.. ఈ టెస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రెండు గ్రామాల మధ్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు! అప్పటివరకూ గేదెను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.