Begin typing your search above and press return to search.

వెళ్ళిపోయినా కాసాని మీదనే బాబు మనసు ?

కాసాని తిరిగి టీడీపీలో చేరితే ఆయనకే టీడీపీ తెలంగాణా పగ్గాలు అప్పగించాలని బాబు ఆలోచిస్తున్నారుట.

By:  Tupaki Desk   |   26 Aug 2024 10:30 PM GMT
వెళ్ళిపోయినా కాసాని మీదనే బాబు మనసు ?
X

తెలంగాణాలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. దాని కోసం ఆయన ప్రతీ వారంతంలో సమయం కేటాయిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ కోలుకోవడం ఇప్పట్లో కష్టమని ఆలోచిస్తున్న టీడీపీ ఇదే అదనుగా సైకిల్ ని తెలంగాణాలో పరుగులు పెట్టించడానికి యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసింది.

తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ కి బలం ఉంది, బీజేపీకి అర్బన్ సెక్టార్ లోనే ఎక్కువ బలం కనిపిస్తోంది. మొత్తంగా బీజేపీ బలం పెంచుకోవాలంటే కొంత కష్టం. అయితే బీజేపీకి ఏపీలో టీడీపీతో పొత్తు ఉంది. తెలంగాణ లో లేదు. కానీ రాజకీయాల్లో ఏపుడు ఏది జరుగుతుంది అన్నది సమయమే డిసైడ్ చేస్తుంది.

అలా కనుక ఆలోచిస్తే టీడీపీ తెలంగాణాలో ముందు తానుగా బలపడితే అపుడు బీజేపీ కూడా తన వైపు చూస్తుందని ఆలోచిస్తోంది. అందుకే టీడీపీని పటిష్టం చేయడం మీద చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇక ఏపీలో టీడీపీకి అధికారం ఉంది. అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉంది. దాంతో ఆ ప్రభావంతో తెలంగాణాలో పార్టీని గాడిన పెట్టవచ్చు అని ఆలోచిస్తున్నారు.

ఈ పరిణామాల క్రమంలో టీడీపీ కొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తెలంగాణాలో టీడీపీని వీడిన వారికి తిరిగి చేరాలంటూ కబురు చేస్తోంది. టీడీపీని వీడిన వారిలో అత్యధికులు బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ అయితే ఇపుడు ఒక విధంగా చెప్పాలంటే చతికిలపడింది అని అంటున్నారు. కాంగ్రెస్ లోకి చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నారు.

అలా వీలు కాని వారు ఉండిపోతున్నారు. ఇపుడు వారిని తన వైపు తిప్పుకుని ఘర్ కా వాపస్ ప్రోగ్రాం ని టీడీపీ చేపట్టింది అని అంటున్నారు. అందులో భాగమే మాజీ మంత్రి బాబూ మోహన్ చంద్రబాబుని వచ్చి కలుసుకున్నారు అని అంటున్నారు. ఆయనకు అధికారం పదవులు అన్నీ టీడీపీ హయాంలోనే వచ్చాయని అంటున్నారు. దాంతో మరోసారి బాబూ మోహన్ తన అదృష్టాన్ని టీడీపీ నుంచి పరీక్షించుకుంటారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పార్టీని ఒక గాడిన పెట్టి హుషార్ తెచిన బలమైన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ 2023లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి ఇష్టపడకపోవడంతో పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఖమ్మం, హైదరాబాద్ లలో భారీ సభలు పెట్టి పార్టీకి ఒక ఊపు తెచ్చారు. అర్ధబలం అంగబలం కలిగిన కాసాని జ్ఞానేశ్వర్ మీదనే టీడీపీ ఇపుడు ఆసక్తిని చూపుతోంది అని అంటున్నారు.

బీఆర్ఎస్ లోకి కాసాని వెళ్ళినా అక్కడ పార్టీ ఓటమి పాలు కావడంతో చేయడానికి ఏమీ లేదని అంటున్నారు. దాంతో ఆయన కూడా తిరిగి సైకిలెక్కే అవకాశం ఉంది అని అంటున్నారు. కాసాని తిరిగి టీడీపీలో చేరితే ఆయనకే టీడీపీ తెలంగాణా పగ్గాలు అప్పగించాలని బాబు ఆలోచిస్తున్నారుట. కాసానికి నాయకత్వ పగ్గాలు అప్పగించి తాను మోనిటరింగ్ చేస్తే తెలంగాణాలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద తొందరలోనే తెలంగాణా టీడీపీకి జవసత్వాలు అందించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.