Begin typing your search above and press return to search.

కాకమీదున్న కాసానికి కారు డోర్ ఓపెన్... హాట్ టాపిక్ గా కాంగ్రెస్ ఆఫర్!

ఈ నేపథ్యంలో రొటీన్ కి భిన్నంగా టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడికి ఆ పార్టీ అధినేత షాకిచ్చారు. అదికూడా ఎన్నికలో సీటు ఇవ్వకుండానో మరొకటొ మరొకటో కాదు.. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయకుండదంటూ!

By:  Tupaki Desk   |   30 Oct 2023 2:00 PM GMT
కాకమీదున్న కాసానికి కారు డోర్  ఓపెన్... హాట్  టాపిక్  గా కాంగ్రెస్  ఆఫర్!
X

సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న కొంతమంది నాయకులు పార్టీలకు హ్యాండ్ ఇస్తుంటారు.. పార్టీ అధినాయకత్వంతో విభేదించి షాకిస్తుంటారు.. మరికొంతమంది ప్రత్యర్థులతో టచ్ లోకి వెళ్లి అధినేతలకు దెబ్బకొడుతుంటారు.. నేటి రాజకీయాల్లో ఇది అత్యంత సహజం! ఈ నేపథ్యంలో రొటీన్ కి భిన్నంగా టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడికి ఆ పార్టీ అధినేత షాకిచ్చారు. అదికూడా ఎన్నికలో సీటు ఇవ్వకుండానో మరొకటొ మరొకటో కాదు.. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయకుండదంటూ!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ములాకత్ లో కలిసిన సంగతి తెలిసిందే. ఆ ములాకత్ లో పోటీకి సిద్ధంగా ఉండాలని, అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని, 87నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని తెలిపారని కథనాలొచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించడానికి బాలయ్య కూడా సిద్ధపడ్డారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తూచ్ అన్నారు!

వాస్తవానికి తెలంగాణ టీడీపీలో ఈ ఎన్నికల కోసమే సుమారు ఏడాదిన్నార కాలంగా కసరత్తు జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం తరువాత పార్టీ ఖమ్మంలో సభ నిర్వహించింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ సభల నిర్వహణకు కసరత్తు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి ములాఖత్ అయిన కాసాని.. అధ్యక్షుడు సూచనల మేరకు పోటీకి సిద్దంగా ఉన్న ఆశావాహులతో జాబితా కూడా సిద్దం చేసారు. అందులో ఒక్కోస్థానానికి ఇద్దరు, ముగ్గురు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో చంద్రబాబు తూచ్ అనడంతో కాసాని హర్ట్ అయ్యారని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలో కొనసాగడానికి మించిన పనికిమాలిన పని మరొకటీ లేదంటూ తన సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం కలగలిపి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారంటే ఏంటో అనుకున్నాను కానీ... ఈరోజు అనుభవిస్తే తెలుస్తుందని.. తాను తయారుచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో కాసాని తన అనుభవాన్ని పంచుకున్నారని అంటున్నారు.

దీంతో కాసాని కాకెత్తిపోతారనే కామెంట్లు ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో కారు డోర్ ఓపెన్ చేసిన బీఆరెస్స్ నేతలు కాసానికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారని తెలుస్తుంది. ఈటల రాజేంద్ర పార్టీ వీడిన తర్వాత.. బీఆరెస్స్ లో ముదిరాజ్ వర్గానికి చెందిన పేరున్న నేతలు లేని లోటు ఉందని.. ఆ లోటును కాస్తాని పూరిస్తారని ఆశిస్తున్నారని అంటున్నారు. దీంతో... పెద్ద పెద్ద ఆఫర్లే ముందుంచుతున్నారని అంటున్నారు.

ఏదో ఒక రకంగ కాసానిని కారెక్కించుకుని.. టీడీపీ - కాంగ్రెస్ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని ప్రచారం చేయించాలనేది గులాబీ నేతల వ్యూహంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్.. అక్కడ గెలిస్తే మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో.. ఆ సీటును కాసానికి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందంట. కాగా... 2014, 2019 ఎన్నికల్లో బీఆరెస్స్ వరుసగా ఈ స్థానంలో ఓడిపోయింది!

మరి ఇన్ని ఆఫర్లు, ఆయనపై ఇరు పార్టీలు పెట్టుకున్న ఇన్నేసి ఆశల నేపథ్యంలో... కాసాని చంద్రబాబుకు ఎప్పుడు బై బై చెబుతారు.. ఇంకెప్పుడు మరో నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.