Begin typing your search above and press return to search.

"జైలు స్ట్రిప్ సెర్చ్.. అల్లు అర్జున్ కు జరిగి ఉంటుంది"... నటి షాకింగ్ వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో ఉండటం తీవ్ర సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 10:41 AM GMT
జైలు స్ట్రిప్  సెర్చ్.. అల్లు అర్జున్  కు జరిగి ఉంటుంది... నటి షాకింగ్  వ్యాఖ్యలు!
X

"పుష్ప-2" సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో.. అదే స్థాయిలో అన్నట్లుగా అల్లు అర్జున్ కు ప్రస్తుతం సమస్యలు చుట్టుముట్టాయనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో ఉండటం తీవ్ర సంచలనంగా మారింది.

దీంతో.. దీనికి సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత వైద్య పరీక్షలు జరిపి, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం తెలిసిందే. దీంతో.. ఆయనను చంచల్ గుఢా జైలుకు తరలించారు పోలీసులు! అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వ్యులు అందడం ఆలస్యం అవడంతో.. ఒక రాత్రి జైల్లో ఉన్నారు!

మరుసటి రోజు ఉదయం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే... "గృహలక్ష్మి" సీరియస్ నటి కస్తురి శంకర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జైల్లోకి అడుగుపెడితే స్ట్రిప్ సెర్చ్ మస్ట్ గా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు.

అవును... తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి కస్తూరి.. జైలుకి వెళ్ళిన తర్వాత ఆమె అనుభవాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా... జైల్లో మొత్తం దుస్తులన్నీ విప్పించి చెక్ చేస్తారాని.. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుందని.. ఈ చెక్కింగ్ కోసం ఎలా పుట్టామో అలానే నిలబడాలని ఆమె తెలిపారు!

ఈ సందర్భంగా మహిళలను మహిళా పోలీసులు, పురుషులను పురుష పోలీసులు చెక్ చేస్తారని.. అయితే మనిషిని తాకరని.. కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ఏమైనా దాచారేమో నని మూడు సార్లు ఒంటిపై దుస్తులు లేకుండా కూర్చుని, లేవమంటారని తెలిపారు. దీంతో.. ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తనకు పోలీసులు వీలైనతవరకూ గౌరవం ఇచ్చారని.. అయితే ఈ స్ట్రిప్ సెర్చ్ మాత్రం చేయాల్సి వచ్చిందని.. ఇందులో కన్సెషన్ ఇవ్వడం కుదరదని అన్నారు. అల్లు అర్జున్ జైలుకి వెళ్లరని, ఈ లోపే బెయిల్ వచ్చేస్తుందని తాను అనుకున్నానని.. అయితే ఆయన జైలుకి వెళ్లారు.. ప్రిజన్ లో నెంబర్ ఇచ్చారు అని కస్తూరి స్పందించారు! ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది!