మెడలో రుద్రాక్షమాలతో కవిత హైదరాబాద్ ఎంట్రీ!
ఈ క్రమంలో మంగళవారం రాత్రిఢిల్లీలోనే ఉన్న కవిత.. బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు.
By: Tupaki Desk | 28 Aug 2024 6:31 PM GMTబీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే.. ఆమె ఆహా ర్యం పూర్తిగా మారిపోయింది. మెడలో రుద్రాక్షమాలతో.. చేతికి కంకణాలతో ఆమె కనిపించారు. మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్న కవిత.. సుమారు 5 నెలలకు పైగానే తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఆమె కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రిఢిల్లీలోనే ఉన్న కవిత.. బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు.
కవిత సహా.. ఆమె భర్త, సోదరుడు కేటీఆర్, ఇతర పార్టీ నాయకులు.. హైదరాబాద్లోని బేగంపేట విమానా శ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. వీరికి పార్టీ నాయకులు , కార్యకర్తల నుంచి భారీ స్వాగతం లభించింది. కొందరు కార్యకర్తలు.. రహదారులపై టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఇదిలావుంటే.. కవిత ఆహార్యం పూర్తిగా మారిపోవడం గమనార్హం. గతంలో ఎప్పుడూ లేని విధంగా కవిత మెడలో రుద్రాక్ష మాల ఉండడం విశేషం.
సహజంగానే దైవ భక్తి మెండుగా ఉన్న కవిత.. పలువురు ఆధ్యాత్మిక వేత్తలను కూడా సంప్రదిస్తూ ఉంటా రు. ప్రస్తుతం జైలు జీవితం గడపడంతో పూర్తిగా ఆమె ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపి నట్టు తెలుస్తోంది. చేతికి కొన్నికంకణాలు కూడా ఉన్నాయి. దారాల వంటి కంకణాలను ఆమె కట్టుకుని కనిపించారు. కష్టాల నుంచి బయటపడేందుకు దైవ మార్గాన్ని ఎంచుకుంటున్నానని.. గతంలో ఆమె మీడియాకు చెప్పారు.
బహుశ ఆ ఉద్దేశంతోనే కవిత.. రుద్రాక్షమాలను ధరించి ఉంటారన్న చర్చ సాగుతోంది. నేరుగా తన తండ్రిని కలుసుకోనున్న కవిత.. అనంతరం.. సోదరుడితో కలిసిమీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ ఎస్ కార్యాలయం సహా.. నేతల ఇళ్ల వద్ద కూడా.. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.