కవిత అరెస్ట్ కు నెల రోజులు
కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా భయం పట్టుకుంది. అవినీతి, అక్రమాల విషయంలో ఆమె అరెస్ట్ సంలనం కలిగించింది.
By: Tupaki Desk | 15 April 2024 9:33 AM GMTఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ, సీబీఐ శాఖలు ఆమెపై కేసులు నమోదు చేశాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో ఆమె జైలులోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో పది రోజుల కస్టడీ తరువాత మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా భయం పట్టుకుంది. అవినీతి, అక్రమాల విషయంలో ఆమె అరెస్ట్ సంలనం కలిగించింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నిస్తోంది. నిజానిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టు కావడం గమనార్హం.
సీబీఐ ఈనెల 12న అరెస్టు చేసింది. కేసులో ఇద్దరిని విచారణ జరిపి కేసులో నిజాలు బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్, కవితలు వెల్లడించే నిజాలపై కేసు ఆధారపడి ఉంది. దీంతో వారి విచారణ పూర్తయితే కానీ అసలు నిజాలు వెల్లడికావు. వారి నుంచి విషయాలు రాబట్టి కేసును ముందుకు నడిపించాలని అధికారులు శ్రమిస్తున్నారు.
కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు చాలా మంది పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు మాది స్వచ్ఛమైన పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది. కవితకు కేసుతో సంబంధం లేదని బుకాయిస్తున్నా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో ఇక ఆమె జైలులోనే ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత సీబీఐ కస్టడీలోనే ఉంది. ఈనెల 23 వరకు అక్కడే ఉండనుంది. ఈ సమయంలో కవితను సీబీఐ ప్రశ్నించనుంది. కేసులో కీలక సాక్ష్యాలు తీసుకుని నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో కవిత, అరవింద్ కేజ్రీవాల్ లను విచారించి అబద్ధాల గుట్టు రట్టు చేయాలని భావిస్తోంది. దీని కోసం వారిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.