సోమవారం కవితకు బెయిల్ ?
ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రానున్నది.
By: Tupaki Desk | 10 Aug 2024 8:38 AM GMTఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో రిమాండ్ ఖైధీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రానున్నది.
వారం రోజుల పాటు ఢిల్లీలో కవిత బెయిలు కోసం న్యాయవాదులతో చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో కవితకు బెయిల్ ఖాయం అన్న సంకేతాలు ఇచ్చారు.
వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుందని .. ఈ అంశం ప్రాసెస్ లో ఉందని కేటీఆర్ అన్నారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం.. కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా వివరాలు బయటకు వచ్చాయి.
కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గారని .. ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే.. కోర్టు సంతృప్తి పడితే బెయిల్ వచ్చినట్లే అని అంటున్నారు.
పదిహేడు నెలల పాటు ఇదే కేసులో జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వచ్చే వారం లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వస్తుందని అంటున్నారు.