ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23వరకు ఈడీ కస్టడీ
కవితను 7 రోజుల కస్టడీకి అప్పగించారు. ఆమె అడిగిన మినహాయింపులు అంగీకరించింది. దీంతో ఆమెకు ఇంటి నుంచే ఆహారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు
By: Tupaki Desk | 16 March 2024 1:37 PM GMTఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఈ స్కాంలో డమ్మీ వ్యక్తితో లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గతంలోనే ఆమెకు చెందిన పది ఫోన్లు స్వాధీనం చేసుకుని అందులోని డేటాను పరిశీలించగా నాలుగు ఫోన్లలో డేటా డిలీట్ కాలేదని గుర్తించారు. ఈ మేరకు ఆమె ఇండో స్పిరిట్ కంపెనీలో వాటాదారుడైన అరుణ్ పిళ్లైని డమ్మీగా చేసుకుని వ్యవహరాలు నడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశారని చెబుతున్నారు.
విచారణలో కూడా ఆమె సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతోనే ఆమె అరెస్ట్ కు దారి తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో కవిత కొన్ని షరతులు విధించినట్లు చెబుతున్నారు. వాటిని కోర్టు కూడా అంగీకరించిందని అంటున్నారు. కవితను 7 రోజుల కస్టడీకి అప్పగించారు. ఆమె అడిగిన మినహాయింపులు అంగీకరించింది. దీంతో ఆమెకు ఇంటి నుంచే ఆహారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆమెను కలుసుకునేందుకు లాయర్లు, కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో దాని కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
మద్యం కేసులో అరెస్టయిన కవితకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు హై బీపీ ఉందని గుర్తించారు. ఆమె అరెస్ట్ తోనే బీపీ పెరిగిందని అంటున్నారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె తరఫు లాయర్ విజ్ణప్తి చేశారు. ఏడు రోజులు ఆమె కస్టడీలో మెడిసన్, ఫుడ్, దుస్తులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది.
కవిత లిక్కర్ కేసులో ఆమె భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు అందజేశారు. అనిల్ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈడీ ఆదేశాలతో అనిల్ వారి ఎదుట హాజరయి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారని అంటున్నారు.
కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రత్యేక సెల్ లో ఆమెను ఈనెల 23వరకు ప్రత్యేక సెల్ లో ఉంచుతారు. కోర్టు ఆదేశాల మేరకు కవితను ఈడీ ఆఫీసులోనే ఉంచనున్నారు. ఈ సందర్భంగా ఆమెపై మోపిన నేరాలకు విచారణ అనంతరం ఆమెకు ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియడం లేదు. మొత్తానికి ఆమెకు శిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు.