కవితకు షాక్.. కస్టడీ పొడిగించిన కోర్టు
ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఈడీకి అనుమతి ఇఛ్చింది
By: Tupaki Desk | 23 March 2024 9:18 AM GMTఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు ఈడీకి అనుమతి ఇఛ్చింది. ఈడీ ఐదు రోజుల కస్టడీకి కవితను అప్పగించాలని కోరింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి ఓకే చెప్పింది. దీంతో ఈనెల 26 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనుంది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఇద్దరిని ఒకేసారి విచారించనుందని తెలుస్తోంది.
కవిత తరఫు న్యాయవాది ఈడీకి నోటీసులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు పట్టించుకోలేదు. కేజ్రీవాల్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఒకే సారి విచారణ చేపట్టే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కవిత ఆమె భర్త బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏవైనా ఆధారాలు లభిస్తే వారిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి.
ఢిల్లీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అరెస్టుతో ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటారో తెలియడం లేదు. కానీ కేసు మాత్రం విచిత్ర మలుపులకు గురవుతోంది. రోజుకో విధమైన తీరుతో కేసు సంచలనాలకు కేంద్రంగా నిలుస్తోంది. దీంతో ఢిల్లీ మద్యం కేసు ఇంకా ఎక్కడకు వెళ్తుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
కవిత భర్త అనిల్ కు కూడా ఈఢీ నోటీసులు ఇచ్చినా అతడు మాత్రం విచారణకు హాజరు కాలేదు. గతంలో కవిత కూడా ఈడీ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. అందుకే ఆమె అరెస్ట్ అనివార్యమైంది. ఇప్పుడు అనిల్ కూడా ఎలాంటి స్పందన చూపకపోతే ఏదో ఒక రోజు అతడిని కూడా అరెస్ట్ చేయడానికి ఈడీ ముందుకు వస్తుందని చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడం అక్రమమని చెబుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు అర్హులేనని తేల్చింది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉండటంతోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. దీంతో కవిత అరెస్ట్ విషయంలో ఆమె ఎన్ని పిటిషన్లు దాఖలు చేసినా అవి బుట్టదాఖలే అనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు.