తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత.. ఎన్నిరోజులు కస్టడీ అంటే
ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు పంపించనున్నారు
By: Tupaki Desk | 26 March 2024 9:24 AM GMTఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు పంపించనున్నారు. అక్కడ 14 రోజుల రిమాండ్ కు కోర్టు అనుమతించింది. దీంతో ఆమె ఇక తీహార్ జైలులో ఉండనున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది. కేసుతో సంబంధం ఉన్న నిందితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కవిత రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించినట్లు చెబుతున్నారు.
కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేయగా దానిపై ఏప్రిల్ 1న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. తన అరెస్టు అక్రమమని మరోమారు కవిత పేర్కొంది. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ అని అభివర్ణించింది. తన అరెస్టుతో తనకు బురద జల్లే ప్రయత్నం చేసినా కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత చెప్పడం గమనార్హం.
బీజేపీ ఆడుతున్న డ్రామానే ఈ అరెస్ట్ అని అభిప్రాయపడింది. ఇప్పటికే ఒక నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చారు. మరో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్ల బ్రాండ్లు ఇచ్చారని ఆరోపించింది. ఇదంతా రాజకీయ డ్రామాగా అభివర్ణించింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కవిత. దీంతో ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు.
కవిత కస్టడీ ముగిసినందున ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెను 14 రోజుల రిమాండ్ కు పంపాలని తీర్పు ఇచ్చారు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. నన్ను అరెస్ట్ చేసినా ఎలాంటి నష్టం లేదు. బీజేపీ ఆడుతున్న డ్రామాకు త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉందన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కవితను ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.