Begin typing your search above and press return to search.

కవిత ను కలిసిన తల్లి శోభ.. వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసా?

ఆమె భర్తను కూడా విచారణకు రావాలని సూచించింది. దీంతో కేసులో అందరిని ఈడీ తనదైన శైలిలో విచారణ కొనసాగించనుంది

By:  Tupaki Desk   |   22 March 2024 5:48 AM GMT
కవిత ను కలిసిన తల్లి శోభ.. వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసా?
X

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ గత ఆరు రోజులుగా సెల్ లో ఉంచుతోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఈనెల 23 వరకు కస్టడీలోనే ఉంచుతోంది. తరువాత కోర్టు ఎదుట హాజరు పరిచి విచారణ కొనసాగించనుంది. ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సిబ్బందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమె భర్తను కూడా విచారణకు రావాలని సూచించింది. దీంతో కేసులో అందరిని ఈడీ తనదైన శైలిలో విచారణ కొనసాగించనుంది.

కవితను కలిసిన తల్లి

కవితను తల్లి శోభ కలిసింది. ఆమె యోగ క్షేమాలను విచారించింది. ధైర్యంగా ఉండాలని సూచించాంది. కోర్టు అనుమతుల ప్రకారం నిన్న 7 గంటల నుంచి 8 గంటల వరకు కవిత తల్లి కలిసి ఆమెతో మాట్లాడింది. తల్లితో పాటు సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, సోదరి సౌమ్య కూడా కవితను కలిశారు. ఆందోళన పడవద్దని చెప్పింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. తన పిల్లల క్షేమ సమాచారం తెలుసుకున్నారని సమాచారం.

కేంద్రంపై గుర్రుగా కేసీఆర్

కూతురు కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ అధినేత, ఆమె తండ్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. అందుకే మెదక్ స్థానం ఇంకా ఎవరికి కేటాయించలేదనే వాదనలు కూడా రావడం గమనార్హం.

బీఆర్ఎస్ వర్గాల్లో భయం?

పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కవిత కేసు ఎటు వెళ్తుందో తెలియడం లేదు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు తో బీఆర్ఎస్ వర్గాల్లో భయం పట్టుకుంది. సీఎంనే అరెస్టు చేయడంతో కవితకు శిక్ష ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈక్రమంలో కేసీఆర్ ఆలోచన ఎలా ఉంటుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.