Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్ పై స్పందించిన కవిత... కామెంట్స్ వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Oct 2023 6:51 AM GMT
బాబు అరెస్ట్ పై స్పందించిన కవిత... కామెంట్స్ వైరల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అలా బాబు అరెస్టై అప్పుడే 50వ రోజు వచ్చేసింది! అయితే... చంద్రబాబు అరెస్టైన మొదట్లో... తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలెవరూ స్పందించలేదనే కామెంట్లు వినిపించాయి. మీడియా ప్రశ్నించినప్పుడు కొంతమంది నేతలు మినహా పెద్దగా భారీ ఎత్తున రియాక్షన్ రాలేదని మాటలు వినిపించాయి!

అయితే... కారణం ఏమైనప్పటికీ.. గతకొన్ని రోజులుగా పలువురు తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్నారు. ముఖ్యంగా బీఆరెస్స్ నుంచి ఈ తరహా స్పందన వస్తుంది. ఇందులో భాగంగా... "తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష గొప్పది.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను" అంటూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో... "పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ చేశారు.. ఇది దురదృష్టకరం.. ఈ వయసులో ఆయనను అలా చేయడం మంచిది కాదు" అని బీఆరెస్స్ మంత్రి, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు స్పందించారు. అనంతరం... కేటీఆర్ కూడా బాబు అరెస్ట్ పై స్పందించారు. జైల్లో చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని, ఆయనకు స్టెరాయిడ్లు ఎక్కించాలని చూస్తున్నారని లోకేష్ ట్వీట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

"చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను.. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరం.." అని అన్నారు. ఇదే సమయంలో ఏపీలో జరిగే రాజకీయ సంఘటనలకు హైదరబాద్ లో ధర్నాలు చేస్తామంటే మాత్రం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కల్వకుంట్ల కవిత స్పందించారు.

అవును... ఎక్స్ వేదికగా కొన్ని రోజులుగా బీఆరెస్స్ ఎమ్మెల్సీ క‌విత "ఆస్క్ కవిత" పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నల‌కు ఆమె స‌మాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఒక నెటిజన్... "చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటీ?" అని అడిగారు. ఈ ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా... "ఈ వయసులో జరగడం దురదృష్టకరం" అని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ ప్రశ్నపై ట్విట్టర్ లో స్పందించిన కవిత... "ఈ వయస్సులో అతనికి జరుగుతున్నది దురదృష్టకరం. కుటుంబం బాధను నేను అర్థం చేసుకున్నాను. కుటుంబ సభ్యులకు నా సానుభూతి" అని అన్నారు. అనంతరం... తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ కు ఏ పార్టీతోనూ జట్టు లేదని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని తెలిపారు!