నెలల పాటు నిద్ర.. ఈ వింత గ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు
అందుకే ఈ ఊరును స్లీప్ హోల్ అని పిలుస్తున్నారట. బాంబు పేల్చినా కూడా లేవరట. అంత గాఢమైన నిద్రలోకి జారుకుంటారట.
By: Tupaki Desk | 14 March 2024 5:30 PM GMTమనిషి ఆరోగ్యానికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. కానీ నిద్ర ఎక్కువైనా కష్టమే. తక్కువైనా ఇబ్బందే. రోజుకు మనిషి ఎన్ని గంటలు నిద్ర పోవాలో అన్ని గంటలే నిద్రపోతే సురక్షితం. అది ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యానికి చేటే. ప్రతి మనిషి సగటున రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. అలా అయితే మనం తిన్న ఆహారాలు జీర్ణమై మన శారీరక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. నిద్ర సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
కజకిస్థాన్ లో కలాచి అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లో ఓ వింత వ్యాధి వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రజలు ఏకంగా ఒకటి కాదు రెండు రోజులు కాదు నెలపాటు నిద్రపోతున్నారట. ఎక్కడ పడితే అక్కడే నిద్ర ముంచుకొచ్చి ఒళ్లు తెలియకుండా నిద్రలోకి జారుకుంటున్నారు. దీంతో ఇదేమైనా వ్యాధేమో అని అందరు చర్చించుకుంటున్నారు. ఆకలి రుచి ఎరుగదు. నిద్ర చోటెరగదు అన్నట్లు వారికి నిద్ర వచ్చిందంటే చాలు అది బజారైనా మరేదైనా నిద్రలోకి జారుకుంటున్నారట.
శాస్త్రవేత్తలు సైతం దీనిపై పరిశోధనలు చేస్తున్నా అంతు చిక్కడం లేదు. ఈ సమస్యతో 14 శాతం మంది ప్రజలు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో 600 మంది జనాభా ఉన్నారు. 2010లో ఓ పాఠశాలలో విద్యార్థులంతా తరగతి గదిలోనే నిద్రపోవడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. వారిని ఎంత లేపడానికి ప్రయత్నించినా వారు అలాగే పడుకున్నారట. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అందుకే ఈ ఊరును స్లీప్ హోల్ అని పిలుస్తున్నారట. బాంబు పేల్చినా కూడా లేవరట. అంత గాఢమైన నిద్రలోకి జారుకుంటారట. మళ్లీ వారికి తెలివి వచ్చి లేస్తేనే కానీ ఎంత ప్రయత్నించినా లేవరట. రామాయణంలో కుంభకర్ణుడి మాదిరి. ఆరునెలలు తిండి ఆరు నెలల నిద్ర కుంభకర్ణుడికి ఉన్న వరం. అలాంటిది వీరికి కూడా ఏదో సోకిందనే వాదనలు వస్తున్నాయి.
దీంతో వారికి ఎక్కడ నిద్ర ముంచుకొస్తే అక్కడే వారి పడక. అది ఏ ప్రదేశమైనా చూసుకోరట. పడుకోవడమే వారి పని. దీంతో ఈ సమస్య ఊరిలో ప్రధానంగా కనిపిస్తోంది. అందరు ఇలాగే చేస్తుండటంతో వారి సమస్యను ఎలా తీర్చాలని పలువురు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఇది ఏ రకమైన వ్యాధి పరిశోధనలకు కూడా అంతిచిక్కకపోవడం గమనార్హం.