Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మూర్ఘత్వంపై కేసీఆర్ ఫైర్

ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహం మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇది ఒక మూర్ఖత్వపు చర్య అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 6:00 AM GMT
కాంగ్రెస్ మూర్ఘత్వంపై కేసీఆర్ ఫైర్
X

తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహం మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఇది ఒక మూర్ఖత్వపు చర్య అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులేనా ఇవి? ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సమావేశాలకు రావాలని, అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. రైతుబంధు ఉద్దేశం, ప్రయోజనాలు సభలో చెప్పాలని, తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని సభలో వివరించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, మూసీ సుందరీకరణ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను, కాంగ్రెస్ నిర్బంధ పాలనను ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని చెప్పారు. శాసనసభ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు కేసీఆర్ నిర్దేశం చేశారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని అంశాల్లో ఏ రకంగా విఫలమైందనే విషయాన్ని సభలో వివరించాలని చెప్పారు. ఫిబ్రవరిలో నిర్వహించబోయే బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతానని కేసీఆర్ చెప్పారు.

చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మరి, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.