ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ ఫాంహౌస్ లో దసరా సందడి ఓ రేంజ్లో
అవును.. బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ విపక్ష నేత కేసీఆర్ సందడి చేశారు. దసరా వేళ.. ఆయన హడావుడి మామూలుగా లేదు.
By: Tupaki Desk | 14 Oct 2024 5:17 AM GMTఅవును.. బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ విపక్ష నేత కేసీఆర్ సందడి చేశారు. దసరా వేళ.. ఆయన హడావుడి మామూలుగా లేదు. కొంతకాలంగా ఆయన కనిపించటమే లేదు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నది లేదు. ఎర్రవెల్లి ఫాంహౌస్ కే పరిమితమైన ఆయన.. అసలు ఎలా ఉన్నారు? అన్న క్లూ లేకుండా పోయింది. దీనికి కారణం..ఆయన తన యాక్టివిటీస్ గురించి ఫోటోలు విడుదల చేస్తున్నది లేదు.
ఇలాంటి వేళ.. దసరా పండక్కి కుటుంబం మొత్తం ఎర్రవెల్లి ఫాంహౌస్ కు చేరుకోవటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నట్లుగా చెప్పాలి. దీనికి తగ్గట్లే బయటకు వచ్చిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడూ లేని విధంగా ఒకే ఫ్రేంలో కేసీఆర్.. ఆయన సతీమణి శోభ.. కొడుకు కేటీఆర్.. కోడలతో పాటు.. మనమరాలు ఆలేఖ్యతో కలిసి సరదాగా ఉన్న కేసీఆర్.. మనమరాలి మొబైల్ నుంచి విదేశాల్లో ఉన్న హిమాన్షుతో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటోను విడుదల చేశారు.
ఫాంహౌస్ లో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు చేయటంతో సందడి వాతావరణం నెలకొంది. మొత్తంగా నెలల తర్వాత గులాబీ బాస్ ఫోటోలు బయటకు వచ్చాయని చెప్పాలి. ఈ మధ్యన కేసీఆర్ కనిపించట్లేదన్న వార్తలు రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఫాంహౌస్ లో తానెంత కులాశగా ఉన్నానన్న విషయాన్ని తాజా ఫోటోతో తెలంగాణ ప్రజలకు చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. దసరా వేడుకల అనంతరం కేటీఆర్.. కటుుంబ సభ్యులు హైదరాబాద్ కు తిరిగి వచ్చేయగా.. గులాబీ బాస్ మాత్రం ఎప్పటిలానే ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోయారు.