మనవడుకి కేసీఆర్ గైడెన్స్... వీడియో హల్ చల్!
ఈ సమయంలో తాజాగా తన మనవడు, కేటీఆర్ కుమారుడూ హిమాన్షు తో కేసీఆర్ ఉన్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
By: Tupaki Desk | 16 Jan 2025 11:38 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆరెస్స్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయట కనిపించడం చాలా వరకూ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీనిపై అధికార పక్షం మండిపడుతూనే ఉంది.
ఈ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆరెస్స్ రాజకీయాల్లో కేటీఆర్, హరీష్ లు యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సమయంలో తాజాగా తన మనవడు, కేటీఆర్ కుమారుడూ హిమాన్షు తో కేసీఆర్ ఉన్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ సమయంలో మనవడిని గైడ్ చేస్తున్నారు కేసీఆర్.
అవును... కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనవడు హిమాన్షు నడుస్తున్నాడు. ఇందులో భాగంగా... తీరిక సమయాల్లో తన తాతయ్యతో వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నట్లున్నాడు. ఈ సమయంలో అతనికి వ్యవసాయ క్షేత్రంలో మెలుకువలు నేర్పుతున్నట్లున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఓ మొక్కను నాటాడు.
ఈ సందర్భంగా పారతో మట్టి తీసి, ఓ మొక్కను నాటి.. దాని చుట్టూ ఎరువు పోసి, తిరిగి పారతో మట్టి కప్పాడు! ఈ సమయంలో అతని పక్కనే నిల్చున్న కేసీఆర్.. గైడ్ చేస్తున్నట్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన హిమాన్షు... "లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్" అని క్యాప్షన్ పెట్టాడు!
ఇదే సమయంలో... వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని.. మన సహజ వనరులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని రాసుకొచ్చాడు. దీంతో... తాత అడుగుజాడల్లో మనవడు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ గైడెన్స్ ఫామ్ కే పరిమితమా, పాలిటిక్స్ లోనూ ఉంటుందా అని మరొకరు స్పందిస్తున్నారు!