కేసీఆర్ జగన్ ప్రభావం ఏమీ లేదా ?
వివిధ రంగాలలో తమ ప్రభావం చూపించిన వారితో రూపొందించిన ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా కేసీఆర్ జగన్ మిస్ అయ్యారు.
By: Tupaki Desk | 29 March 2025 10:30 PMదేశంలో ప్రభావవంతమైన ప్రముఖుల జాబితా ఒకటి తాజాగా వెలువడింది. వందమంది తో తయారు చేసిన జాబితా ఇది. వివిధ రంగాలలో తమ ప్రభావం చూపించిన వారితో రూపొందించిన ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా కేసీఆర్ జగన్ మిస్ అయ్యారు. ఈ ఇద్దరూ గతంలో టాప్ హండ్రెడ్ లో ఏదో ఒక ర్యాంకింగ్ లో కనిపించిన వారే కావడం విశేషం.
బీఆర్ఎస్ అధినేతగా మాజీ సీఎం గా పద్నాలుగేళ్ల పాటు తెలంగాణా ఉద్యమాన్ని నడిపించిన ఉద్యమ నేతగా కేసీఆర్ అత్యంత ప్రభావశీలంగా 2023 వరకూ జాతీయ తెర మీద కనిపించారు. అయితే ఆయన అదే ఏడాది చివరిలో అధికారం నుంచి దిగిపోవడంతో ఆయన ప్రభావం తగ్గిపోయింది అన్నది ఈ లిస్ట్ చూస్తే అర్ధం అవుతోంది అని అంటున్నారు.
ఇక ఏపీలో అయిదేళ్ళ పాటు సీఎం గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో తన నిర్ణయాలతో ప్రభావం చూపిస్తూ ఉండేవారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు జాతీయ స్థాయిలో డిబేట్లుగా సాగాయి. అలాగే ఏపీలో రాజకీయ దూకుడు కూడా అప్పట్లో వైసీపీ అధినేతను జనం నోళ్ళలో నానేలా చేసింది. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జగన్ ఓటమి పాలు కావడంతో ఆయన ప్రభావం కూడా జాతీయ తెర మీద ఏమీ కాకుండా పోయింది అని అంటున్నారు
ఇక ఇండియన్ ఎక్స్ ప్రెస్ తయారు చేసిన టాప్ హండ్రెడ్ ప్రభావంతమైన ప్రముఖుల జాబితాలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే మజ్లిస్ అధినేత ఒవైసీ కూడా జాబితాలో చోటు సంపాదించారు. ఆయన ముస్లిం సమాజం తరఫున తనదైన శైలిలో పోరాడుతూ జాతీయంగా ప్రాముఖ్యత సంపాదించారు అని చెప్పాలి.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా 14వ స్థానంలో ఉండడం విశేషం. చంద్రబాబు అంతకు ముందు ఏడాది ఈ లిస్ట్ లో లేరు. కానీ అధికారంలోకి వచ్చాక కూటమి సారధిగా సాధించిన విజయాలతో బాబు జాతీయ స్థాయిలో ప్రముఖుడిగా తన ర్యాక్ ని గణనీయంగా పెంచుకున్నారు అని అంటున్నారు.
అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 73వ ర్యాంక్ కి సాధినారు. ఆయన ఈ ర్యాంక్ ని సాధించడం ఇదే ప్రధమం. జనసేనాని గా డిప్యూటీ సీఎం గా పవన్ జాతీయ స్థాయిలో తన పలుకుబడిని పెంచుకున్నారు అన్న దానికి నిదర్శనమే ఈ ర్యాంక్ అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఓటమి తరువాత జగన్ కానీ కేసీఆర్ కానీ పెద్దగా మీడియా ముందుకు రాకపోవడం అసెంబ్లీలో కూడా వారి వాణి వినిపించకపోవడం జాతీయ స్థాయిలో అటు ఎన్డీయేలో కానీ ఇండియా కూటమిలో కానీ లేకుండా న్యూట్రల్ గా ఉండడం వల్ల కూడా జాతీయ రాజకీయ తెర మీద వారి పాత్ర పరిమితం అయిపోయింది అన్న చర్చ ఉంది.
జాతీయంగా నలుగుతూ ఉండాలి, అలాగే రాజకీయంగా ఫుల్ ఫోకస్ తో ఉంటేనే ప్రభావంతమైన పాత్రలో కనిపిస్తారన్నది ఈ ర్యాంకులను చూసిన తరువాత అంటున్న మాట. రానున్న కాలంలో అయినా జగన్ కేసీఆర్ టాప్ హండ్రెడ్ లో తమ ర్యాంకులను నమోదు చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఒకనాడు కేసీఆర్ అయినా జగన్ అయినా జాతీయ స్థాయిలో విశేష ప్రభావం చూపించిన లీడర్లుగానే ఉండేవారు. అయితే పవర్ అన్నది దూరం కావడంతో పాటు రాజకీయంగా ఏ విధంగా ముందుకు సాగాలన్న దాని మీద ఈ ఇద్దరు నేతలు ఆలోచించుకుంటున్న నేపథ్యంలో ఈ ర్యాంకుల జాబితా విడుదల అయింది అని అంటున్నారు.