Begin typing your search above and press return to search.

కేసీఆర్...జగన్ ఇద్దరూ ఇద్దరే సుమా !

ఒకే సమయంలో ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకూ సీఎంలుగా పనిచేశారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 3:42 AM GMT
కేసీఆర్...జగన్ ఇద్దరూ ఇద్దరే సుమా !
X

ఒకే సమయంలో ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకూ సీఎంలుగా పనిచేశారు. ఆ టైమ్ లో అనేక సార్లు భేటీలు కూడా వేశారు. ఈ ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా కూడా అచ్చం అన్నదమ్ములే అని అంతా అనుకున్నారు. అది సెటైరికల్ గా కూడా అన్న సందర్భాలు ఎన్నో.

ఎందుకంటే ఇద్దరికీ ఎన్నో పోలికలు ఉన్నాయని చెబుతారు. ఇద్దరూ సీఎంలుగా ఉన్న టైమ్ లో తమ రాజ ప్రాసాదాలను దాటి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇద్దరూ జనాలకూ పార్టీ జనాలకు దూరం పాటించారు. ఇద్దరినీ కలవడం మంత్రులకూ ఎమ్మెల్యేలకూ కష్టసాధ్యం అన్న మాట వినిపించేది.

ఇక ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఒకేలా ఉంటారు. తమకు తట్టిన ఆలోచనలతోనే ముందుకు సాగుతారు అని అంటారు. సిట్టింగులు అందరికీ టికెట్లు ఇచ్చి కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఓటమి పాలు అయితే ఏపీలో 2024లో వైసీపీ అధినేత జగన్ సగానికి సగం మంది సిట్టింగులకు టికెట్లు సొంత నియోజకవర్గాలలో ఇవ్వకుండా కొందరికి బదిలీలు మరి కొందరికి అసలు ఇవ్వకుండా చేసి ఓటమిని తెచ్చుకున్నారు అని అంటారు.

ఇలా అనేక విషయాలలో ఈ ఇద్దరికీ పోలికలు చెబుతారు. ఇక ఇద్దరూ భారీ ఓటమిని మూటకట్టుకున్నాక కూడా తమదైన శైలిలోనే రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండానే ఏడాదిగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన తరఫున ఎమ్మెల్యేలు సభకు వస్తున్నారు. అక్కడికి అది ఒకింత ఊరటగా చెప్పుకోవాలి.

ఏపీలో చూస్తే గత ఆరు నెలలలో రెండు సార్లు అసెంబ్లీ సమావేశం అయితే జగన్ రెండు సార్లు మొదటి రోజు కొద్ది గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. మూడవసారి బడ్జెట్ సెషన్ కి సిద్ధం అవుతున్న వేళ అసెంబ్లీకి రాను అని ఆయన మీడియా ముఖంగా చెప్పేశారు. ఇలా అటు కేసీఆర్ ఇటు జగన్ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు అని అంటున్నారు.

గతంలో 23 సీట్లకే పరిమితం అయినా చంద్రబాబు అసెంబ్లీకి దాదాపుగా మూడేళ్ల పాటు వచ్చారని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా గతంలో తెలంగాణా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు అని కూడా చెబుతున్నారు. చట్ట సభల ద్వారా నాయకులు మాట్లాడినపుడే మరింత ప్రజాదరణ దక్కుతుందని అంటున్నారు.

అంతే కాదు చట్ట సభలలో ప్రతిపక్షం ఉంటేనే రాణింపు ఉంటుందని కూడా అంటున్నారు. జగన్ అయినా కేసీఆర్ అయినా తాము సీఎంలుగా ఉన్నపుడు సభను మంచి మెజారిటీ ఉంది అన్న భావంతో పూర్తి ఆధిపత్యంతో నడిపారు అని అంటున్నారు. దాంతో ఇపుడు ఓడలు బళ్ళు అయిన వేళ సభకు వెళ్తే అధికార పక్షానికి కార్నర్ అవుతామన్న ఆలోచనతోనే రావడం లేదా అన్న చర్చ కూడా ఉంది.

అయితే సభకు వెళ్లడం వల్ల జగన్ కేసీఆర్ లకే మేలు అని అంటున్నారు. రాజకీయంగా వారికే అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. సభలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయడం ద్వారా జనం మద్దతుని పొందవచ్చు అని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా విమర్శలు వచ్చినా లేక సర్కార్ పెద్దలు కార్నర్ చేసినా జనంలో కావాల్సినంత సానుభూతి కూడా దక్కుతుందని అంటున్నారు.

ఇలా సభకు వెళ్లడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నా కూడా రాకుండా ఉండిపోవడం నిజంగా పొరపాటే అని అంటున్నారు. సభకు వెళ్లకపోవడం వల్ల జనంలోకి రాంగ్ సిగ్నల్స్ పంపించిన వారు అవుతున్నారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే రెండు సార్లు సీఎం గా చేశారు. ఈసారి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే వారసులకు చాన్స్ ఉంటుంది.

అందువల్ల అటు హరీష్ రావు, కేటీఆర్ సభకు వెళ్తున్నారు. జగన్ విషయం అలా కాదు ఆయనే మళ్లీ సీఎం అవుతారు. కాబట్టి కేసీఆర్ కంటే ఆయనకే అసెంబ్లీకి వెళ్లడం ఇంకా ముఖ్యమన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి బడ్జెట్ సెషన్ కి వెళ్లమని జగన్ తేల్చడంతో విపక్ష నేతగా ఉండగా సభకు వెళ్లదలచుకోలేదని ఆయన చెప్పేశారు అని అర్ధం అవుతోంది అని అంటున్నారు.