Begin typing your search above and press return to search.

కేసీఆర్ కనిపించుట లేదు.. కలకలం రేపుతున్న పోస్టర్లు

బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనిపించుట లేదన్న పోస్టర్లు తాజాగా వెలిసి కలకలాన్ని రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Sept 2024 4:37 AM
కేసీఆర్ కనిపించుట లేదు.. కలకలం రేపుతున్న పోస్టర్లు
X

బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనిపించుట లేదన్న పోస్టర్లు తాజాగా వెలిసి కలకలాన్ని రేపుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఖమ్మం పట్టణం దారుణంగా దెబ్బ తింది. ఖమ్మంలోని పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం సరైన రీతిలో స్పందించలేదని.. కాస్త ఆలస్యంగా రియాక్టు అయినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వేళ.. ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపిస్తూ.. చేపట్టాల్సిన చర్యల గురించి కేసీఆర్ లాంటి వారు మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇలాంటివేమీ తనను కదిలించవన్నట్లుగా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు కేసీఆర్.

తాజాగా హైదరాబాద్ మహానగరంలోని కొన్నిచోట్ల కేసీఆర్ కనిపించుట లేదన్న పోస్టర్లు వెలవటం కలకలాన్ని రేపుతోంది. ఈ పోస్టర్లలో కేసీఆర్ ఫోటోను ముద్రించారు. ‘‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత’’ అంటూ పోస్టర్లపై రాసుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా విపత్తు విరుచుకుపడితే.. వారిని పరామర్శించేందుకు కేసీఆర్ వెళ్లని వైనంపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ఆయన తీరు మాత్రం మారకపోవటం తెలిసిందే. విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇదే ధోరణిని ప్రదర్శించటం హాట్ టాపిక్ గా మారింది.