కేసీఅర్ అంటే యునానిమస్...ఇది చాలదా ?
ఆయన పుట్టిన రోజున ఏపీలోని కూటమి పార్టీల పెద్దలతో పాటు వైఎస్సార్ నుంచి కూడా గ్రీటింగ్స్ రావడం విశేషం.
By: Tupaki Desk | 17 Feb 2025 12:05 PM GMTకె చంద్రశేఖరరావు షార్ట్ కట్ లో కేసీఆర్ దశాబ్దాలుగా తెలుగు నాట రాజకీయ తెర పైన తన ప్రత్యేకతను నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన 1981 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట యువజన కాంగ్రెస్ నేతగా ఉండేవారు.
ఆ తరువాత 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఅర్ పెట్టడంలో అందులో చేరి 1983లో టికెట్ సాధించి సిద్దిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆనాటికి ఆయన వయసు 29 ఏళ్ళు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. అయితే 1985లో మొదటిసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. అలా 1989, 1994, 1999లలో ఏకంగా నాలుగు సార్లు ఇరవై ఏళ్ళ పాట్లు సిద్ధిపేటను ఏలారు.
చంద్రబాబు సీఎం గా ఉండగా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు ఉప సభాపతి హోదా లభించింది. అది కాస్తా అసంతృప్తిగా మారి 2000లో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2021లో టీఆర్ఎస్ అన్న పార్టీని పెట్టారు.
ఇక అక్కడ నుంచి కేసీఅర్ లో ఉద్యమకారుడు బయటకు వచ్చారు. ఆయన పద్నాలుగేళ్ళ పాటు చేసిన పోరాటానికి ఫలితంగా తెలంగాణా రాష్ట్రం వచ్చింది. రెండు సార్లు కేసీఅర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణాను కొట్లాడి తీసుకుని వచ్చిన నేతగా ప్రసిద్ధం అయ్యారు.
ఇక 2004 నుంచి 2014 మధ్యలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా కొన్నాళ్ళు పనిచేశారు. ఇలా ఆయన రాజకీయ జీవితం పరిపూణంగానే సాగింది. ఇక కేసీఆర్ తాజా పుట్టిన రోజుతో 71 ఏళ్ళు నిండి 72వ ఏట అడుగుపెడుతున్నారు. మరో మూడేళ్ళలో తెలంగాణాకు ఎన్నికలు ఉన్నాయి. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ 75 ఏళ్ళ వయసులో అచ్చం చంద్రబాబు మాదిరిగానే మూడవసారి సీఎం అవుతారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కేసీఅర్ ని రాజకీయంగా ఎంతలా విభేదించినా ఆయనతో స్నేహాన్ని అనుబంధాన్ని అంతా కోరుకుంటారు. ఆయనకు అందరూ ఇష్టులే ఉన్నారు. ఇక ఉమ్మడి ఏపీని విడదీసి తెలంగాణాను సాధించినా ఏపీలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
కేసీఅర్ కి ఏపీ రాజకీయ నాయకత్వాలు కూడా అంతా యునానిమస్ గా గ్రీట్ చేస్తారు. ఆయన పుట్టిన రోజున ఏపీలోని కూటమి పార్టీల పెద్దలతో పాటు వైఎస్సార్ నుంచి కూడా గ్రీటింగ్స్ రావడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కేసీఅర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా కేసీఅర్ కి గ్రీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. దీనిని చూసిన వారు అంతా ఏపీలో యునానిమస్ గా కేసీఅర్ కి గ్రీటింగ్స్ దక్కాయని అంటున్నారు. కేసీఆర్ విషయంలో అంతా ఏకాభిప్రాయంతోనే ఉన్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసీఆర్ సహచరుడు. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వారు. టీడీపీలో 18 ఏళ్ళకు పైగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి కేసీఅర్ ఉద్యమ శైలి, ఆయన ఉక్కు సంకల్పం అన్నా గౌరవం అని చెబుతారు. జగన్ విషయానికి వస్తే ఆయనకు కేసీఅర్ స్నేహితుడుగా శ్రేయోభిలాషిగా ఉంటారని అంటారు. మొత్తానికి ఏపీలో అధికార విపక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నా కేసీఅర్ విషయంలో మాత్రం అంతా ఒక్క తీరుగా ఉండడం ఒకింత ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఉంది అనే చెప్పాలి.