Begin typing your search above and press return to search.

కేసీఆర్ వర్సెస్ రేవంత్ : వస్తున్నా...చూసుకుందాం !

తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు రసవత్తరమైన ఘట్టానికి తెర లేస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 4:19 AM GMT
కేసీఆర్ వర్సెస్ రేవంత్ : వస్తున్నా...చూసుకుందాం !
X

తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు రసవత్తరమైన ఘట్టానికి తెర లేస్తోంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఅర్ నేను వస్తునా అని బిగ్ సౌండ్ చేశారు. నేను వస్తే మామూలుగా ఉండదు అంటూ పొలిటికల్ టీజర్ వదిలారు. నేను వస్తే దబిడ దిబిడే అంటూ రీ సౌండ్ చేశారు. తెలంగాణా ప్రజల కోసం ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నానని ప్రకటించేశారు.

నేను అన్నీ గంభీరంగా చూస్తున్నాను గమనిస్తున్నాను అని కేసీఅర్ తనదైన శైలిలో ఫార్మ్ హౌస్ లో నుంచి క్యాడర్ సమావేశం నుంచి గర్జించారు. ప్రజలు మంచి పాలనను అందించే బీఆర్ఎస్ ని గద్దె దించారని ఇపుడు అన్నీ ఇబ్బందులే అన్నారు. గ్రహ స్థితులు బాలేనపుడు ఇలాగే జరుగుతుందని అన్నారు. తెలంగాణాకు తీరని నష్టం కాంగ్రెస్ పాలన అన్నారు.

కాంగ్రెస్ పాలన మీద జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన విశ్లేషించారు. ఇక ప్రజలకు అండగా నిల్వాల్సిందే అన్నారు. అందుకే తాను ఫిబ్రవరి చివరి వారం నుంచి జనంలోకి వస్తున్నాను అని చెప్పారు. భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే కేసీఆర్ కి ధీటైన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గంభీరంగా ఏమి చూస్తున్నారు అని కేసీఆర్ ని నిలదీశారు. తెలంగాణాను పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే దానికి కాస్తా పదేళ్ల కాలంలో ఏడు లక్షల కోట్ల దాకా అప్పులు చేసిన ఘనత కేసేఅర్ కే చెల్లింది అని విమర్శించారు.

రైతు బంధుతో సహా అన్ని పధకాలను ఎగవేసిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. ఆయన గోస భరించలేకనే ఇక చాలు అని జనాలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు అని అన్నారు. కేసేఅర్ ఫార్మ్ హౌస్ నుంచి చేస్తున్న ప్రకటనలను ఆయన ఎద్దేవా చేశారు.

అసెంబ్లీకి కేసీఅర్ వస్తే అన్ని విషయాలు ఆయనకు వివరిస్తామని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ చేసిన మేలు కూడా తప్పకుండా ఆయన విని తీరాలని అన్నారు. కేసీఅర్ గత వైభవం గురించి చెబుతున్నారని కానీ వర్తమానం అలా లేదని అంటూ ఆయన చెల్లని వేయి రూపాయల కాగితం లాంటి వారు అని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. ఇపుడు దానికి విలువ లేదని ఎవరైనా జేబులో పెట్టుకుని తిరిగినా జైలులో వేస్తారు అని రేవంత్ రెడ్డి సెటైర్లు పేల్చారు.

మొత్తానికి చూస్తే కేసీఆర్ బిగ్ సౌండ్ చేశారు. తెలంగాణా రాజకీయాల్లో ఆయన తమ మార్క్ మళ్ళీ చూపించాలని భావిస్తున్నారు. అయితే ఆయన గర్జనకు రీ సౌండ్ తో రేవంత్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మరి కేసీఅర్ జనంలోకే వస్తారా లేక అసెంబ్లీకి కూడా వస్తారా రేవంత్ వర్సెస్ కేసీఅర్ గా తెలంగాణా రాజకీయంలో సరికొత్త అంకం మొదలయ్యేది ఎపుడు అన్న చర్చ అయితే సాగుతోది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.