Begin typing your search above and press return to search.

కొడితే దిమ్మ‌తిరిగి పోవాల‌: కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి స‌ర్కారు పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 10:51 AM GMT
కొడితే దిమ్మ‌తిరిగి పోవాల‌:  కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి స‌ర్కారు పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ``సైలెంట్‌గా ఉన్న‌న‌ని ఏమో అనుకుంటున్న‌రు. కొడితే దిమ్మ తిరిగిపోవాల‌`` అని వ్యాఖ్యానించారు. తాజాగా జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ నాయ‌కుల‌తో ఫాం హౌస్‌లో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల‌న ఏమీ బాగోలేద‌ని.. త‌న‌కు అన్ని వ‌ర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ అందుతోంద‌ని చెప్పారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిత‌క్కువ‌-ప్ర‌చారం ఎక్కువ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఇలాంటి వాళ్ల‌ను కొట్ట‌డం అంటే దిమ్మ‌తిరిగిపోయేలా ఉండాల‌న్నారు. తాను మౌనంగా, ఉన్నానంటే.. చేత‌కాక కాద‌ని వ్యాఖ్యానించారు. తాను అన్ని విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాన‌న్నారు. కొడితే మామూలుగా కొట్టేది లేద‌ని.. గ‌ట్టిగానే దిమ్మ‌తిరిగిపోయేలా కొడ‌తామ‌న్నారు. స‌మ‌యం ముగిసిపోయింద‌ని.. ఇక‌, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని కేసీఆర్ తెలిపారు.

ఫిబ్ర‌వ‌రిలో భారీ స‌భ‌

ఫిబ్ర‌వ‌రి చివ‌రి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని కేసీఆర్ చెప్పారు. జ‌హీరాబాద్ లోనే తొలి బ‌హిరంగ స‌భ ఉంటుంద‌న్నారు. ప్ర‌భుత్వ దుర్మార్గాల‌ను ఎండ‌గ‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. రైతులను, మ‌హిళ‌ల‌ను కూడా ఆ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఊళ్ల‌లోకి పోతే ఈ ప్ర‌భుత్వం బండారం బ‌య‌ట ప‌డ‌తంది! అంటూ.. త‌న‌దైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్య‌మాలు త‌మ‌కు కొత్త కాద‌ని కేసీఆర్ చెప్పారు. అయితే.. ఈసారి పోరాటాలు మ‌రిన్ని ఎక్కువ‌గా ఉంటాయ‌న్నారు.

ప్రాజెక్టుల‌పై యుద్ధం

ప్రాజెక్టుల‌పై యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని.. కేసీఆర్ చెప్పారు. త‌మ హయాంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. సంగమేశ్వరం , బసవేశ్వ‌రం, కాళేశ్వరం వంటి తెలంగాణ‌కు జీవ నాడి వంటి అన్ని ర‌కాల ప్రాజెక్టుల‌ను కూడా ధ్వంసం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ``ప్రాజెక్టుల‌పై దండ‌యాత్ర‌` పేరుతో ఉద్య‌మాలు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ``ఎవడో ఏమో చెబితే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం చెప్పారు`` అని కేసీఆర్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కరోనాతో రాష్ట్రం అల్లాడిపోయి.. ఆకులు మేసినా.. `రైతు` బంధు ఇచ్చి అన్న‌దాత‌ల‌ను ఆదుకున్న విష‌యాన్ని పేర్కొన్నారు. మంచి పథకాలు తెచ్చి ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటే అంతా గంగలో కలిసిపోయిందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదని, ఈ విష‌యాన్ని సీఎం నుంచి మంత్రుల వ‌ర‌కు తెలుసుకోవల‌సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంపై పోరాటం చేసేందుకు శ్రేణులు స‌న్నద్ధం కావాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు.