Begin typing your search above and press return to search.

జీవిత కాలంలో చూడని దేశానికి వెళ్ళనున్న కేసీఆర్ !

అయినా సరే కేసీఆర్ అపుడు కూడా అమెరికా వెళ్లలేదని అంటున్నారు. అయితే ఇపుడు ఆయన అమెరికా వెళ్లడానికి ఒక బలమైన రక్త సంబంధమే కారణమని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 6:35 PM GMT
జీవిత కాలంలో చూడని దేశానికి వెళ్ళనున్న కేసీఆర్ !
X

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఉద్యమకారుడుగా ఉంటూ అధికారం అందుకున్న అరుదైన నేత. సాధారణంగా ఉద్యమాలు చేసే వారు అధికారానికి ఎపుడూ దగ్గరగా రాలేరు. అలాగే ఉద్యమం వేరు రాజకీయం వేరు.

ఉద్యమం ఎపుడూ అగ్గిలా రాజుకుంటూనే ఉంటుంది. రాజకీయంలో రాజీలూ పేచీలు రెండూ ఉంటాయి. అయినా సరే కేసీఆర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయనలో ఎపుడూ ఉద్యమకారుడిని తగ్గకుండానూ చూసుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ తెలంగాణాకు మాజీ సీఎం గా మారి ఏడాది కాలం అయింది. ఆయన మెల్లగా విపక్ష జీవితానికి అలవాటు చేసుకున్నారు అనే చెప్పాలి. మరో వైపు చూస్తే కేసీఅర్ ఈ ఏడాది కాలంలో పార్లమెంట్ ఎన్నికలపుడు కొద్ది సమయం తప్ప మిగిలిన కాలం అంతా జనానికి దూరంగా తన ఫాం హౌస్ లోనే గడిపారు.

మరో వైపు చూస్తే ఆయన తొందరలో జనంలోకి వచ్చి తెలంగాణా అంతా పెద్ద ఎత్తున పర్యటిస్తారు అన్న వార్తలు వినిపించాయి. అయితే వాటిని తలదన్నేలా మరో వార్త ఇపుడు ముందుకు వచ్చింది అదేంటి అంటే కేసీఆర్ ఏకంగా కొన్నాళ్ల పాటు తెలంగాణాకే కాదు దేశానికి దూరంగా ఉండబోతున్నారు అన్నదే ఆ వార్త.

కేసేఅర్ తొందర్లో అతి పెద్ద విదేశీ పర్యటనను పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన అమెరికా వెళ్లబోతున్నారు అని తెలుస్తోంది. అదే విధంగా మరో వార్త కూడా దీనితో పాటే వినవస్తోంది. అదేంటి అంటే కేసీఆర్ తన జీవిత కాలంలో ఎపుడూ అమెరికా వెళ్ళలేదని.

ఇది నిజంగా సంచలన వార్త అని అంటున్నారు. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు తమ తొలి విదేశీ పర్యటననే అమెరికాగా చేసుకుంటారు. అలాంటిది కేసీఆర్ మాత్రం రెండు సార్లు సీఎం గా ఉన్న కొన్నాళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నా దాని కంటే ముందు రాష్ట్ర మంత్రిగా పనిచేసినా కూడా ఎన్నడూ అమెరికాకు పోలేదని అంటున్నారు

ఇక ఆయన సీఎం గా రెండే రెండు దేశాలలో పర్యటన చేశారని అంటున్నారు. అవి చైనా, సింగపూర్ అని తెలుస్తోంది. ఆ విధంగా చూస్తే అతి తక్కువ విదేశీ పర్యటనలు చేసిన సీఎం గా కేసీఅర్ ది ఒక రికార్డు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత అమెరికాలోనే చదువుకున్నారు. కేటీఆర్ అయితే కొన్నాళ్ల పాటు అక్కడ జాబ్ కూడా చేశారు.

అయినా సరే కేసీఆర్ అపుడు కూడా అమెరికా వెళ్లలేదని అంటున్నారు. అయితే ఇపుడు ఆయన అమెరికా వెళ్లడానికి ఒక బలమైన రక్త సంబంధమే కారణమని అంటున్నారు. తన మనవడు హిమాన్షు కోరిక మేరకే ఆయన అమెరికా యాత్ర చేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల తెలంగాణాకు వచ్చిన హిమాన్షు తాతను అమెరికాకు రావాలని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని కోరారట.

దాంతో తన ప్రాణంగా ప్రేమించే మనవడి కోరికను కాదనలేకనే కేసీఆర్ అమెరికా టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. అక్కడ ఆయన దాదాపుగా రెండు నెలల పాటు ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అమెరికాలోని ఎన్నారైలతో మీటింగులు పెట్టి బీఆర్ఎస్ పటిష్టత కోసం వారి సహకారం తీసుకునే విధంగా కూడా వ్యూహాలు రూపొందిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే కేసీఆర్ జనంలోకి జనవరిలో వచ్చే కార్యక్రమం కొన్నాళ్ళ పాటు వాయిదా పడవచ్చు అని అంటున్నారు.