Begin typing your search above and press return to search.

కేసీఅర్ అసెంబ్లీకి వైఎస్సార్ ఉన్నపుడు...రేవంత్ ఉన్నపుడూ రాలేదా ?

రాజకీయాన్ని అలా స్పోర్టీవ్ గా తీసుకుంటే ఓడినా కూడా ప్రజల కోసం సభలకు వెళ్లాలి. ప్రజలు తమకు అప్పగించిన ప్రతిపక్ష పాత్రకు కూడా న్యాయం చేయాలి

By:  Tupaki Desk   |   25 April 2024 1:44 PM GMT
కేసీఅర్ అసెంబ్లీకి వైఎస్సార్ ఉన్నపుడు...రేవంత్ ఉన్నపుడూ రాలేదా ?
X

అదేంటో రాజకీయలలో కొందరు నేతల తీరు చిత్రంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం వల్లనే తాము ఉన్నత స్థానాలను అధిరోహించామని వారు ఎందుకు గమనించరో అర్ధం కాదు అంటుంటారు. అధికారం ఉంటేనే సభకు వస్తామని అది కూడా రాజుగా రాజమార్గంలోనే అంటే కుదురుతుందా అన్నదే ప్రశ్న. ప్రజాస్వామ్యం లో గెలుపు ఓటములు బొమ్మా బొరుసు లాంటివి. ఓడడం అత్యంత సహజం.

రాజకీయాన్ని అలా స్పోర్టీవ్ గా తీసుకుంటే ఓడినా కూడా ప్రజల కోసం సభలకు వెళ్లాలి. ప్రజలు తమకు అప్పగించిన ప్రతిపక్ష పాత్రకు కూడా న్యాయం చేయాలి. కానీ కొంతమంది నేతలు ఓడాక చట్ట సభలకు ముఖం చాటేస్తూంటారు. ఎందుకంటే సీఎం సీట్లో ప్రత్యర్ధి ఉంటారు. దాంతో తాము అపోజిషన్ లో కూర్చోవడమా అని అనుకుంటారు. దానిని అవమానంగా భావిస్తూంటారు.

గతంలో కొందరు కీలక నేతలు అలాగే చేశారు. అది తెలుగు రాజకీయాల్లోనే కాదు పొరుగున ఉన్న తమిళ రాజకీయాల్లోనూ కనిపిస్తూ వచ్చింది. ఇపుడు లేటెస్ట్ గా చూస్తే తెలంగాణా ఎన్నికల్లో ఓడాక కేసీఆర్ అసెంబ్లీకి ముఖమే చూడడం లేదు. ఇప్పటికి అయిదు నెలలు అయింది. అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కానీ కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు.

అదే టైం లో కేసీఆర్ కొన్నాళ్ళ పాటు అనారోగ్యంతో ఇబ్బంది పడి ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. దాంతో ఆయన కోలుకున్నాక సభకు వస్తారని అంతా భావించారు.ఆ తరువాత ఆయన పార్టీ మీటింగ్స్ పెట్టారు. బహిరంగ సభలకు వెళ్తున్నారు. అదే విధంగా ఆయన మీడియా డిబేట్లకు కూడా వస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆయన అసెంబ్లీ ముఖం మాత్రం చూడడం లేదు.

రీజన్ ఏమిటి అంటే చాలా చెబుతున్నారు. అయితే అన్నింటి కంటే ముఖ్యమైనది ఆయన ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేకపోతున్నారా అన్న చర్చ వస్తోంది. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడిగా సభలో ఉన్నారు. ఆయనను విపక్షం నుంచి ధీటుగా ఎదుర్కోవడం కష్టతరమైన విషయం గా భావించి కేసీఆర్ సభకు రావడం లేదా అన్న చర్చ నడుస్తోంది.

దాంతో పాటు కేసీఅర్ అప్పట్లో సీఎం గా ఉన్నపుడు తెలుగుదేశం పార్టీ నేతగా రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అప్పట్లో ఆయన సభలో మాట్లాడుతూంటే నాటి అధికార పక్షం అయిన టీఆర్ఎస్ అడ్డుకుంది. ఇపుడు కూడా అలాగే కేసీఆర్ ని అడ్డుకుంటారు అన్న అనుమానాలు ఏవో ఉండి ఉంటాయని అంటున్నారు. అంతే కాదు కేసీఆర్ గట్టిగా మాట్లాడాలి అన్నా మైక్ ఇస్తారా అన్నది మరో డౌట్ గా ఉందిట. ఒకవేళ ఇచ్చి ఆయన మాట్లాడినా ఆయన వాదనలు వీగిపోయేలా పదునైన వాదనలు అవతల వైపు నుంచి పంపించి ఒప్పించే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందని అందుకే రావడం లేదు అని అంటున్నారు.

గతంలో కూడా వైఎస్సార్ సీఎం గా ఉమ్మడి ఏపీలో ఉన్న టైం లో కేసీఆర్ సభకు రాలేదు అని అంటున్నారు. వైఎస్సార్ కూడా నాడు బలమైన సభా నాయకుడిగా ఉంటూ వచ్చారు. ఆయన కూడా విపక్షానికి చాన్స్ ఇచ్చినా వారి వాదనను ధీటుగా తిప్పికొట్టే వారు. మొత్తానికి డిబేట్ ముగిసే సమయానికి వైఎస్సార్ దే పై చేయి అయ్యేది. దాంతో అనాడు కూడా విపక్షంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వంటి వారిని ముందు పెట్టి కేసీఆర్ గైర్ హాజరు అయ్యేవారు అని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు కూడా అలాంటిదే జరుగుతోందా అన్న చర్చ సాగుతోంది. అవతల వైపు సీఎం గా బలమైన నేతలు ఉంటే కనుక కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమన్నది పక్కన పెడితే కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని చూసిన వారు మాత్రం ఈ అభిప్రాయానికే వస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెట్టి చూసినపుడు విపక్షంలో ఉన్న వారు ప్రజల గొంతుకగా ఉండాలి. అందులో అధికారంలో ఉంటూ విపక్షంలోకి వచ్చిన వారు మరింత బాధ్యతగా ప్రజల సమస్యల మీద డిబేట్ చేయాల్సి ఉంటుంది. వారి అనుభవం అక్కడ పనికి వస్తుంది. అలా చూసుకుంటే కేసీఆర్ అసెంబ్లీఎకి వెళ్ళడం మంచిదని అది ఆయన పార్టీకి కూడా మంచిదని అంటున్నారు. కానీ కేసీఆర్ తీరు చూస్తే కనుక ఆయన సభకు నమస్కారం అనేట్లుగా ఉన్నారని అంటున్నారు చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమైనా ఆయన సభలో కనిపిస్తారో ఏమో.