Begin typing your search above and press return to search.

నో కన్ ఫ్యూజన్... ఆ విషయంలో కేసీఆర్ నెంబర్ వన్!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలవ్వడంతో మరింత సందడి నెలకొంది.

By:  Tupaki Desk   |   19 April 2024 4:49 AM GMT
నో కన్  ఫ్యూజన్... ఆ విషయంలో కేసీఆర్  నెంబర్  వన్!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలవ్వడంతో మరింత సందడి నెలకొంది. తొలి రోజు ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు కూడా! ఏపీలో అధికార పార్టీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసేయ్యగా.. కూటమికి మాత్రం ఇంకా కొన్ని స్థానాల్లో అస్పష్టత ఉన్న పరిస్థితి అని అంటున్నారు. మరోపక్క తెలంగాణలో మాత్రం కేసీఆర్ తనదైన క్లారిటీతో ముందుకు పోతున్నారు.

అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆరెస్స్ కు వరుసగా పలు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పంచుకున్నాయి. ఇలా తమ పార్టీలోని పలువురు నేతలను రాష్ట్రంలో అధికార పార్టీ, దేశంలోని అధికారపార్టీ పంచుకున్న కేసీఆర్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనక్కి తగ్గలేదు. రెండు జాతీయ పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేసేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంకా డైలమాలో ఉంది! ఇందులో భాగంగా.. ఇంకా మూడు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదే క్రమంలో... 17స్థానాలకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించేసినా.. ఒకటి రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు తప్పవని అంటున్నారు. ఈ విషయంలో భారీ చర్చలు నడుస్తున్నాయని కథనాలొస్తున్నాయి.

ఇలా ఈ రెండు పార్టీల పరిస్థితి అలా ఉంటే... కేసీఆర్ మాత్రం తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. మరో మాట లేకుండా ఎన్నికలకు సిద్ధమైపోయారు. పలువురు అభ్యర్థులు, నేతలు పార్టీని వీడినా.. తగ్గేదేలే అని కార్యకర్తల్లో కదనోత్సాహన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దీంతో.. నో కన్ ఫ్యూజన్.. ఈ విషయంలో కేసీఆరే నెంబర్ వన్ అని కామెంట్లు చేస్తున్నారు పరిశీలకులు.

కాగా... తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆరెస్స్ కీలక నేతలైన కడియం శ్రీహరి, కే కేశవరావు, గడ్డం రంజిత్‌ రెడ్డి, దానం నాగేంద్రర్, తెల్లం వెంకటరావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హైదరాబాద్‌ సిటీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారు సైతం సైలెంటయిపోయారు! అయినా కూడా కేసీఆర్ ముందుకి కదిలారు!