Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇలా అయిపోతుంద‌ని అనుకోలేదు: కేసీఆర్‌

బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఇలా అయిపోతుంద‌ని అనుకోలేద‌న్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 2:58 PM GMT
తెలంగాణ ఇలా అయిపోతుంద‌ని అనుకోలేదు:  కేసీఆర్‌
X

బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఇలా అయిపోతుంద‌ని అనుకోలేద‌న్నారు. తాజాగా ఆయ‌న మూడు జిల్లాల్లో ప‌ర్య‌టించి రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారి బాధ‌లు కూడా విన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఇలా అయిపోతుంద‌ని అనుకోలేద ని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఆయన.. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి.? సాగునీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారు. ముందే చెబితే వేసుకునే వాళ్లం కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టకాలం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పదేండ్లుగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు లేని కష్టాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్ ప్ర‌శ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు మాత్ర‌మే అప్ప‌ట్లో హామీలు ఇచ్చింద‌ని చెబితే ఎవ‌రూ న‌మ్మ‌లేద న్నారు. ``నేను ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చెప్పా. కాంగ్రెస్ వ‌స్తే.. రైతులకు నీళ్లు ఇవ్వ‌రు. రైతు బంధు ఇవ్వ‌రు. ద‌ళిత బంధు ఇవ్వ‌రు. న‌మ్మ‌కండి అన్నా. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. అరె.. ప‌ట్టుమ‌ని 100 రోజులు కూడా కాలే.. రాష్ట్రంలో ఇన్ని ఆత్మ‌హ‌త్య‌లా?`` కేసీఆర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

రైతు కుటుంబానికి ఐదు 5 ల‌క్ష‌ల సాయం

రైతు కుటుంబంలో డ‌బ్బు లేక వివాహం చేయ‌డం ఇబ్బందిగా ఉంద‌ని తెలియ‌డంతో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. వెంట‌నే ఆయ‌న రూ.5 ల‌క్ష‌లు ఇచ్చారు. జ‌నగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ కు తన గోడు వెళ్ల‌బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకున్నారు. దీంతో కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను ప్రకటించారు.